హిమంత బిశ్వశర్మపై ఈసీ ఆగ్రహం.. ఏమన్నదంటే..!
హిమంతపై ఈసీ ఆగ్రహం కాంగ్రెస్ మిత్రపక్షం నేతను బెదిరించిన అసోం మంత్రి హిమంత బిశ్వశర్మపై ఈసీ 48 గంటల నిషేధం విధించింది.

న్యూఢిల్లీ: అసోం మంత్రి, బీజేపీ నాయకుడు హిమంత బిశ్వశర్మపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) 48 గంటల నిషేధం విధించింది. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ చైర్పర్సన్ హంగ్రామా మొహిలరీకి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఈసీ ఈ నిషేధం విధించింది.
హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలు, ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏప్రిల్ రెండో తేదీ (శుక్రవారం) నుంచి 48 గంటల పాటు బహిరంగ సభలు, ప్రదర్శనలు, రోడ్‌షోలు నిర్వహించడం, ఎలక్ట్రానిక్/ ప్రింట్/ సోషల్ మీడియాతో వ్యాఖ్యలు గానీ, ఇంటర్వ్యూల్లో గానీ పాల్గొనరాదు అని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.
బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ చైర్పర్సన్ హంగ్రామా మొహిలరీని బహిరంగంగా బెదిరించారని, కేంద్ర దర్యాప్తు సంస్థను అడ్డం పెట్టుకుని జైలుకు పంపుతామని హిమంత బిశ్వ శర్మ హెచ్చరికలు జారీ చేశారని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీనిపై శుక్రవారం లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
ఒకవేళ హంగ్రామా వేర్పాటువాద చర్యలకు పాల్పడితే జైలుకెళ్తాడు.. బాథాను ప్రోత్సహిస్తే జైలుకెళ్తారు.. దీనిపై బోలెడంతా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇది నేరుగా జరిగిన చర్చ.. ఈ అంశాన్ని ఎన్ఐఏ దర్యాప్తుకు ఆదేశిస్తాం అంటూ హంగ్రామాను నేరుగా హిమంత బిశ్వ శర్మ బెదిరించారని ఆయనకు ఇచ్చిన నోటీసులో ఈసీ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఫ్యూచర్‌కు లైఫ్‌లైన్.. డీల్ అమలుకు రిలయన్స్ 6 నెలల టైం!
బ్యాంకులకు 1285 కోట్ల ఎగవేత
బంగారం ధర రూ.40 వేల దిగువకు.. ఎందుకంటే?
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్: కొత్త ఐటీఆర్ ఫారాల్లో మార్పుల్లేవ్
అల్లం టీతో ఆస్తమాకు గుడ్‌బై.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

