అసోం, అండమాన్‌లో కంపించిన భూమి

గువాహటి: ఈశాన్య రాష్ట్రం అసోంతోపాటు అండమాన్ దీవుల్లో భూకంపాలు సంభవించాయి. సోమవారం అర్థరాత్రి 11.51 గంటలకు అండమాన్ దీవుల్లో భూమి కంపించగా.. ఈ తెల్లవారుజామున 1.32 గంటలకు అసోంలోని మొరిగావ్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఈ ఉదయం ఈ విషయాన్ని వెల్లడించింది. అందరూ నిద్రిస్తున్నవేళ అకస్మాత్తుగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు.
అండమాన్ దీవుల్లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. మొరిగావ్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2.9గా నమోదైనట్లు తెలిపింది. అయితే ఇప్పటివరకు రెండు ప్రాంతాల్లో ప్రాణ నష్టంగానీ, ఆస్తి నష్టంగానీ జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

