Myanmar Earthquake | భూకంప మృతులు 1600 పైనే.. మరణాల సంఖ్య పది వేలు ఉండొచ్చని అంచనా!
శుక్రవారం వరుస భూ కపంపాలతో వణికిపోయిన మయన్మార్‌లో శనివారం మరోసారి భూప్రకంపనలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో 4.7 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. కా
- మయన్మార్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
- మళ్లీ స్వల్ప ప్రకంపనలు.. బాసటగా నిలిచిన దేశాలు
Myanmar Earthquake | బ్యాంకాక్, మార్చి 29: శుక్రవారం వరుస భూ కపంపాలతో వణికిపోయిన మయన్మార్‌లో శనివారం మరోసారి భూప్రకంపనలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో 4.7 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. కాగా శుక్రవారం నాటి భూకంప మృతుల సంఖ్య 1644 దాటింది. శనివారం అనేక భవనాల శిథిలాల నుంచి మృతదేహాల వెలికితీత కొనసాగింది. మృతుల సంఖ్య 10 వేలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 3,408 మంది గాయపడ్డారని, మరో 139 మంది గల్లంతయ్యారని మయన్మార్ సైనిక ప్రభు త్వం ప్రకటించింది. కాగా, భూకంప మరణాల సంఖ్య ఊహించని స్థాయిలో ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వచ్చిన వరుస భూకంపాల ధాటికి నగరంలోని అనేక బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం కాగా రోడ్లు చీలిపోవడంతో వంతెనలు కూలిపోయాయి. ఒక డ్యామ్ బద్ధలైంది. పొరుగున ఉన్న థాయ్‌ల్యాండ్‌లో కూడా భూకంపం తీవ్రతకు గ్రేటర్ బ్యాంకాక్ ప్రాంతంలోని అనేక భవనాలు కూలిపోయాయి. శిథిలాల నుంచి ఇప్పటివరకు 6 మృతదేహాలను వెలికితీయగా 26 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరో 47 మంది ఆచూకీ తెలియడం లేదని వారు చెప్పారు. కాగా, శుక్రవారం బ్యాంకాక్‌లో పురిటి నొప్పులతో బాధ పడుతున్న మహిళకు వైద్యులు ఓ పార్కులో డెలివరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రపంచ దేశాల సాయం
వరుస భూప్రకంపనలతో తల్లడిల్లుతున్న మయన్మార్‌కు ప్రపంచ దేశాల ఆపన్న హస్తం అందించాయి. చైనా, హాంకాంగ్, భారత్ పదుల సంఖ్యలో సహాయక సిబ్బందిని మయన్మార్‌కు పంపాయి. హాంకాంగ్, భారత్ సహాయక సామాగ్రి, ఔషధాల వంటి సామాగ్రి అందించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మయన్మార్‌కు సాయం చేస్తామని ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ 27 లక్షల డాలర్లను మయన్మార్‌కు తక్షణ సహాయంగా ప్రకటించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

