కల్వర్టును ఢీకొన్న సిమెంటు లారీ.. డ్రైవర్ మృతి

వికారాబాద్: జిల్లాలోని బొంరాస్‌పేట్ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన సిమెంట్ లారీ కల్వర్టును ఢీకొని కిందపడిపోయింది. దీంతో లారీ డ్రైవర్ ఆనంద్ కుమార్ మరణించాడు. సిమెంట్ లోడుతో ఓ లారీ కొడంగల్ నుంచి పరిగి వెళ్తున్నది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం చౌదర్పల్లి గేట్ సమీపంలో జాతీయ రహదారిపై కల్వర్టును ఢీకొని, కింద పడిపోయింది. ప్రమాద ధాటికి లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. సిమెంట్ బస్తాలు క్యాబిన్‌పై పడటంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. జేసీబీ సాయంతో డ్రైవర్‌ను బయటకుతీశారు. 108 అంబులెన్సులో కొడంగల్ దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ డ్రైవర్ మృతిచెందాడు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతుని స్వస్థలం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా రాజాపూర్ అని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

