సర్కారీ కొలువు వదిలి సాగులోకి
- తెలంగాణ గడ్డపై డ్రాగన్ ఫ్రూట్
- మార్కెట్లో కిలోకు 400-800
- సేద్యం చేస్తున్న రైతు శ్రీనివాస్‌రెడ్డి

మంచి విద్యావంతుడు.. పైగా సర్కారీ కొలువు. అంతకుమించి ఇంకేం కావాలి. కానీ, అవేవీ ఆయనను సంతృప్తి పరచలేదు. ఆ ఉద్యోగాన్ని వదిలి, నెత్తికి రుమాలు చుట్టారు. లుంగీ పైకెత్తి కట్టి చేత్తో పార పట్టారు. ఉద్యోగాన్ని వదిలేయటం అంటే అంతకుమించి సంపాదిస్తేనే దానికి అర్థం ఉంటుంది. ఆ ఆలోచనతోనే డ్రాగన్ ఫ్రూట్‌ను సాగుచేస్తున్నారు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లకు చెందిన రైతు వనంపల్లి శ్రీనివాస్‌రెడ్డి.
మంచాల, జనవరి 3: విదేశాల్లో సాగు చేసే డ్రాగన్ ఫ్రూట్‌కు మన మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఆ పండులో మంచి ఔషధగుణాలున్నాయి. మార్కెట్లో కిలోకు రూ.400 నుంచి రూ.800 వరకు ధర పలుకుతున్నది. పండిస్తే ఆ పంటనే పండించాలని నిర్ణయం తీసుకొన్నారు శ్రీనివాస్‌రెడ్డి. బీకాం, ఎల్ఎల్బీ చేసిన ఈయన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ విభాగంలో ఉద్యోగం పొందారు. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలన్న లక్ష్యంతో 2000 సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేసి పంటసాగుపై అధ్యయనం చేశారు.
శాస్త్రవేత్తల సహకారంతో దేశ,విదేశాల్లో పర్యటించి డ్రాగన్ ఫ్రూట్ సాగుతీరును తెలుసుకొన్నారు. తన మూడెకరాల భూమిలో భూసార పరీక్ష నిర్వహించారు. వాతావరణ పరీక్ష చేయించారు. సమశీతోష్ణ్ణ స్థితి డ్రాగన్ ఫ్రూట్ పంటకు అనువైనదని తేలటంతో, మహారాష్ట్ర నుంచి డ్రాగన్ ఫ్రూట్ 435 మొలకలను తెచ్చి రెండెకరాల్లో నాటారు. అందుకు రూ.5 లక్షలు అయ్యింది. ఏడాదిన్నరలోనే పంట చేతికి వచ్చింది. శ్రీనివాస్‌రెడ్డి సాగుచేసిన డ్రాగన్‌ఫ్రూట్ తోటను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కూడా పరిశీలించి వివరాలు తెలుసుకొన్నారు.
సాగు వివరాలు
రాష్ట్రంలోని వ్యవసాయ పొలాలు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనువైన నేలలు. పంటకు ఎలాంటి తెగుళ్లు సోకవు, వాటికి కలుపు తీయటం, దున్నించటం, పర్యవేక్షణకు ఏడాదికి రూ.6 వేల ఖర్చు ఉంటుంది. నిత్యం 8 నుంచి 10 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. నాటిన ఏడాదిన్నరలో పూత మొదలై కాత వస్తుంది. రాత్రి 11 గంటలకు పూలు విచ్చుకొని తెల్లవారుజామున 4 గంటలకు ముడుచుకుంటాయి. మొక్క జీవితకాలం 30 ఏండ్లు. మొదటి సంవత్సరం 10 నుండి 25 కాయలు కాస్తుంది. రెండో సంవత్సరం 30 నుంచి 40కాయలు.. ఇలా పెరుగుతూనే ఉంటాయి. ఒక కాయ 350 నుంచి 400 గ్రాములు బరువు ఉంటుంది. మొదటి రెండేండ్లు ఎకరాకు టన్ను చొప్పున, మూడో ఏడు నుంచి ఎకరాకు నాలుగు టన్నుల చొప్పున దిగుబడి వస్తుంది.
పండులో బోలెడన్ని పోషక విలువలు
డ్రాగన్ ఫ్రూట్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో ఆరోగ్య పోషకాలు మొండుగా ఉంటాయి. సౌందర్య సాధన ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. జ్యూస్‌తో పాటు వైన్ కూడా తయారుచేస్తారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ కంటే ఎక్కువ సంపాదించాలి
సాఫ్ట్వేర్ ఇంజినీర్ కంటే రైతు అధికంగా సంపాదించాలి. ఆ దిశగా పంటలు సాగు చేయాలి. నూతన విధానాలు పాటించడమే కాక మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటలను పండించాలి. డ్రాగన్ ఫ్రూట్‌తో పాటు రామఫలం, పనస, పెద్ద ఉసిరి, దానిమ్మ, అల్లనేరేడు, సపోటా, చైనా జామ, తైవాన్ చింతపండు, నారింజ, నిమ్మ, బొప్పాయి, మరో 8 రకాల మామిడి పండ్ల మొక్కలను కూడా పెంచుతున్నాను.
- రైతు వనంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఫోన్ నంబర్: 9676000776
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

