Health tips | పుచ్చపండును ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. పెడితే ఏమవుతుందో తెలుసా..?
Health tips | వేసవి తాపం నుంచి బయటపడానికి చాలామంది ఎండా కాలంలో బటర్ మిల్క్, నిమ్మరసం, కొబ్బరినీళ్లు లాంటి వాటిని ఆశ్రయిస్తుంటారు. అదేవిధంగా చల్లచల్లటి పండ్ల జ్యూస్‌లను తాగుతుంటారు. ఇలా వేసవి తాపం నుంచి రక్షించే వాటిలో పుచ్చపండు (Watermelon) కూడా ఒకటి. పుచ్చపండులో 95 శాతం నీరు ఉంటుంది.
Health tips : వేసవి తాపం నుంచి బయటపడానికి చాలామంది ఎండా కాలంలో బటర్ మిల్క్, నిమ్మరసం, కొబ్బరినీళ్లు లాంటి వాటిని ఆశ్రయిస్తుంటారు. అదేవిధంగా చల్లచల్లటి పండ్ల జ్యూస్‌లను తాగుతుంటారు. ఇలా వేసవి తాపం నుంచి రక్షించే వాటిలో పుచ్చపండు (Watermelon) కూడా ఒకటి. పుచ్చపండులో 95 శాతం నీరు ఉంటుంది. కాబట్టి ఎండా కాలంలో తరచూ పుచ్చపండును తింటే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఎర్రగా, తీయగా, జ్యూసీగా ఉండే పుచ్చపండు తినడాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. వేసవిలో రోడ్లపై విరివిగా ఈ పుచ్చపండ్లు లభిస్తాయి. పుచ్చపండులో పోషక విలువలు కూడా మెండుగా ఉంటాయి. అయితే ఈ పండును ఫ్రిజ్‌లో పట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకో తెలుసుకుందాం..
పుచ్చపండులో నీటిశాతంతోపాటు పోషక విలువలు ఎక్కువ. పొటాషియం పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. దీనిలో విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఉంటాయి. ఇది శరీరంలోని వేడిని తొలగిస్తుంది. అయితే ఇన్ని సుగుణాలున్న పుచ్చపండును ఫ్రిజ్‌లో పెట్టకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఉంచితే దానిలో ఉండే పోషక విలువలు నశిస్తాయంటున్నారు. అంతేకాదు.. పుచ్చకాయను కోసి ఫ్రిజ్‌లో పెడితే మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయ్యి ఆస్పత్రిపాలు కావాల్సి వస్తుందంటున్నారు.
సౌత్ సెంట్రల్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ల్యాబోరేటరీలో చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పుచ్చపండును కోసి ఫ్రిజ్‌లో పెడితే ఆ ముక్కలపై బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉందని తేలింది. అది తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది. పరిశోధకులు పుచ్చపండ్లను -44, -55, -70 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద ఫ్రిజ్‌లో భద్రపరిచారు. -70 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద నిల్వ చేసినవి ఎక్కువ పోషకాలు కోల్పోయినట్లు గుర్తించారు. ఈ పండ్లను ఒక వారం ఫ్రిజ్‌లో ఉంచితే కుళ్లిపోయే అవకాశం ఉందంటున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పుచ్చపండు విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

