Donald Trump | దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్.. మరో మూడు రాష్ట్రాల్లో నిక్కీ హేలీపై ఘన విజయం
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూసుకుపోతున్నారు. ఇప్పటికే తన ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీని (Nikki Haley) ఆమె సొంతరాష్ట్రంలోనే ఓడించి ఊపుమీదున్న ట్రంప్.. మరోసారి విజయాల పరంపరను కొనసాగించారు.
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూసుకుపోతున్నారు. ఇప్పటికే తన ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీని (Nikki Haley) ఆమె సొంతరాష్ట్రంలోనే ఓడించి ఊపుమీదున్న ట్రంప్.. మరోసారి విజయాల పరంపరను కొనసాగించారు. ప్రైమరీ ఎన్నికల్లో భాగంగా మిచిగాన్, ఇడాహో, మిస్సౌరీ రాష్ట్రాల్లో శనివారం ఓటింగ్ జరిగింది. వాటిల్లోనూ హేలీపై ఆయన పైచేయి సాధించారు. ట్రంప్ దాదాపు 98 శాతం అంటే 1575 ఓట్లతో గెలుపొందగా, నిక్కీకి 36 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఇప్పటివరకు అయోవా, న్యూ హాంప్షైర్, నెవాడా, యూఎస్ వర్జిన్ ఐలాండ్స్, మిచిగాన్, మిస్సౌరీ, ఇడాహో, సౌత్ కరోలినా, నార్త్ కరోలినాలో విజయాలతో అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్ ముందంజలో ఉన్నారు. వచ్చే మంగళవారం మరో 15 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో మెజార్టీ స్థానాల్లో గెలిచినట్లయితే.. వచ్చే జులైలో ఆయనను రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో ఈ ఏడాది నవంబర్లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, ప్రెసిడెంట్ జో బైడెన్(Joe Biden) మధ్య గట్టి పోటీ ఉండనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

