పడేసిన బ్లూచిప్ సంస్థలు.. సెన్సెక్స్ 250, నిఫ్టీ 58 పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి నష్టాలోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా ప్రతీకార సుంకాలు విధించనుండటంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా ఒక్కరోజు భారీగా లాభపడిన సూచీలకు బ్లూచిప్ సంస్థల షేర్లలో భారీగా క్రయవిక్రయాలు జరగడంతో తిరిగి నష్టాల్లోకి పడిపోయాయి.
ముంబై, జనవరి 13 : దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి నష్టాలోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా ప్రతీకార సుంకాలు విధించనుండటంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా ఒక్కరోజు భారీగా లాభపడిన సూచీలకు బ్లూచిప్ సంస్థల షేర్లలో భారీగా క్రయవిక్రయాలు జరగడంతో తిరిగి నష్టాల్లోకి పడిపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్టీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు పతనం చెందడంతో మార్కెట్లో సెంటిమెంట్ నీరుగారింది. మరోవైపు కార్పొరేట్ల నిరుత్సాహక ఆర్థిక ఫలితాలు కూడా పతనానికి ఆజ్యంపోసింది. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు నిధులను తరలించుకుపోవడం కూడా సూచీల పతనాన్ని ప్రేరేపించింది.
దీంతో ఇంట్రాడేలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 250.48 పాయింట్లు కోల్పోయి 83,627.69 వద్ద స్థిరపడింది. మరోసూచీ నిఫ్టీ 57.95 పాయింట్లు పతనం చెంది 25,732.30 వద్దకు జారుకున్నది. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరివరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. చివర్లో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో భారీ నష్టాలను తగ్గించుకోగలిగాయి. మరోసారి అమెరికా ప్రతీకార సుంకాల బాంబు పేల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారి అలజడికి గురయ్యాయి.
దీనికి తోడు రూపాయి బలహీనపడటం, క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, యూఎస్ బాండ్ ఈల్డ్ పెరగడం, ఎఫ్ఐఐలు తరలిపోతుండటం దలాల్‌స్ట్రీట్ పతనానికి కారణాలని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ట్రెంట్, లార్సెన్ అండ్ టుబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, మారుతి, ఐటీసీ, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. కానీ, ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. రంగాలవారీగా టెలికాం సూచీ 1.18 శాతం పతనం చెందగా, దీంతోపాటు ఇండస్ట్రీయల్స్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్, రియల్టీ, ఎనర్జీ రంగ సూచీలు నష్టపోగా..ఐటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్, మెటల్, ఆర్థిక సేవలు, కమోడిటీస్ షేర్లు లాభాల్లోకి వచ్చాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

