False Positivity | ఫాల్స్ పాజిటివిటీ.. ప్రతిసారి వ్యక్తిత్వ వికాస సూక్తులే కాదు.. అప్పుడప్పుడు ఓదార్పూ కావాలి!
False Positivity | రాధిక జీవితం సాఫీగా సాగిపోతున్నది. మంచి ఉద్యోగం. మంచి భర్త. సువిశాలమైన ఇల్లు. పిల్లలిద్దర్నీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నది. ఇంతలోనే ఓ అనూహ్య పరిణామం.
False Positivity | రాధిక జీవితం సాఫీగా సాగిపోతున్నది. మంచి ఉద్యోగం. మంచి భర్త. సువిశాలమైన ఇల్లు. పిల్లలిద్దర్నీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నది. ఇంతలోనే ఓ అనూహ్య పరిణామం. కోరిక తీర్చలేదన్న కారణంతో బాస్ ఆమె మీద అసమర్థురాలనే ముద్ర వేశాడు. చేయని తప్పులు నెత్తిన మోపాడు. దీంతో ఉద్యోగం పోయింది. సరిగ్గా అదే సమయంలో భర్త వ్యాపారం దివాలా తీసింది. రోజువారీ ఖర్చులకు కూడా తడుముకోవాల్సిన పరిస్థితి. ఆ బాధల్ని పంచుకునేందుకు బాల్య స్నేహితురాలికి ఫోన్ చేసింది రాధిక. సంభాషణలో ఓదార్పు లభించలేదు సరికదా… ‘దిగాలుపడి ఎలాంటి ప్రయోజనం లేదు. నీ మొండితనం కారణంగా లక్షణమైన ఉద్యోగం కోల్పోయావు.
పిల్లల భవిష్యత్తునూ దెబ్బతీస్తున్నావు. ఇప్పటికైనా మారు. ఎవరి ఓదార్పు కోసమో ఎదురుచూడటం మూర్ఖత్వం అవుతుంది’ అంటూ అటువైపు నుంచి కటువైన మాటలు వినిపించాయి. తాను ఎలాంటి సాయమూ చేయలేనంటూ పరోక్షమైన సంకేతాలు అందాయి. ఇవి రాధికకు ఊరటనివ్వలేదు సరికదా! ఇక నుంచి ఎవరి ముందూ బాధలు చెప్పుకోకూడదు అనిపించిందామెకు. నిజమే, ప్రతి సందర్భంలోనూ వ్యక్తిత్వ వికాస సూక్తులు పనిచేయవు. కొన్నిసార్లు ఆ మాటలు వికటిస్తాయి కూడా. దీన్నే ‘టాక్సిక్ పాజిటివిటీ’ లేదా ‘ఫాల్స్ పాజిటివిటీ’ అంటారు నిపుణులు. ఆత్మీయులు కష్టంలో ఉన్నప్పుడు అండగా ఉన్నామనే భరోసా కల్పించాలి. వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాలతో ఊదరగొట్టడం సరికాదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

