Father – Son Wicket | క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత అరుదైన రికార్డు.. వాళ్ల చేతిలో ఔటైన తండ్రీకొడుకులు ఎవరు?
Father - Son Wicket : క్రికెట్లో అన్నదమ్ములు ఒకేసారి ఒకే జట్టుకు ఆడిన సందర్భాలు ఉన్నాయి. కానీ తండ్రీకొడుకులు ఆడిన సందర్భాలు మాత్రం టార్చిలైటు వేసి వెతికినా కనిపించవు. కానీ, వారిద్దరినీ పెవిలియన్ పంపిన బౌలర్లు కొందరు ఉన్నారు. క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత అరుదైన రికార్డు. భారత స్టార్ బౌలర్..
Father – Son Wicket : క్రికెట్లో అన్నదమ్ములు ఒకేసారి ఒకే జట్టుకు ఆడిన సందర్భాలు ఉన్నాయి. కానీ తండ్రీకొడుకులు ఆడిన సందర్భాలు మాత్రం టార్చిలైటు వేసి వెతికినా కనిపించవు. కానీ, వారిద్దరినీ పెవిలియన్ పంపిన బౌలర్లు కొందరు ఉన్నారు. క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత అరుదైన రికార్డు. అలాంటి వారిలో కొందరు ఇప్పటికీ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) అందులో ఒకడు. మిగతా బౌలర్లు ఎవరు? వాళ్ల చేతిలో అవుటైన తండ్రీకొడుకులు ఎవరు? అనేది తెలుసుకోవాలని ఉందా.. అయితే.. ఇది చదివేయండి.
వెస్టిండీస్ పర్యటనలో రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) అరుదైన రికార్డు నెలకొల్పాడు. కరీబియన్ తండ్రీకొడుకులను పెవిలియన్ పంపిన తొలి ఇండియన్‌గా, ఈ ఫీట్ సాధించిన ఓవరాల్‌గా ఐదో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అవును.. విండీస్ దిగ్గజ క్రికెటర్ శివనరైన్ చందర్‌పాల్ (Shivnarine Chanderpaul), అతడి కుమారుడు తేజ్‌నరైన్ చందర్‌పాల్(Tegenarine Chanderpaul)ను అతను అవుట్ చేశాడు. ఢిల్లీలో విండీస్ మ్యాచ్‌తో టెస్టుల్లో 25 ఏళ్ల అశ్విన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు
శివనరైన్ చందర్‌పాల్, అశ్విన్, తేజ్‌నరైన్ చందర్‌పాల్

ఆ టెస్టులో అతను 47 పరుగులతో ఆడుతున్న శివనరైన్ను అవుట్ చేశాడు. తాజాగా విండీస్‌లో పర్యటనతో డొమినికా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తేజ్నరైన్ను అవుట్ చేశాడు. దాంతో, తండ్రీకొడుకులను అవుట్ చేసిన తొలి ఇండియన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 479 వికెట్లు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో ఇండియన్ అశ్వినే.
ఇయాన్ బోథమ్
ఇంగ్లిష్ క్రికెటర్ ఇయాన్ బోథమ్(ion botham) తండ్రీ కొడుకులిద్దరీనీ అవుట్ చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. కివీస్ క్రికెటర్లు లాన్స్ కెయిర్న్స్, క్రిస్ కెయిన్స్‌ను అతను అవుట్ చేశాడు. లాన్స్ కెయిర్న్స్ 1974-85 మధ్య న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించగా, క్రిస్ 1989-2006 మధ్య కివీస్‌కు ఆడాడు. బోథమ్ టెస్టుల్లో లాన్స్‌ను మూడుసార్లు అవుట్ చేశాడు.
ఇయాన్ బోథమ్, క్రిస్ కెయిన్స్, లాన్స్ కెయిర్న్స్,

1978లో ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన మ్యాచ్‌లో లాన్స్‌ను బోథమ్ తొలిసారి పెవిలియన్ చేర్చాడు. న్యూజిలాండ్ పర్యటనలో క్రిస్‌ను అవుట్ చేసి తండ్రీకొడుకుల వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బోథమ్ 1976-1992 మధ్య ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1977-1992 మధ్య 15 ఏండ్లపాటు సుదీర్ఘ ఫార్మాట్ ఆడాడు. 102 టెస్టుల్లో 168 ఇన్నింగ్స్‌లలో 383 వికెట్లు తీసుకున్నాడు.
వసీం అక్రం
పాక్ లెజెండ్ బౌలర్ వసీం అక్రం(wasim akram) కూడా లాన్స్, క్రిస్ కెయిన్స్లను అవుట్ చేశాడు. 1985 న్యూజిలాండ్ పర్యటనలో డ్యునెడిన్ టెస్టులో తొలిసారి లాన్స్ వికెట్‌ను పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించినప్పటికీ పది వికెట్లు పడగొట్టిన అక్రమ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత 1995లో క్రిస్ కెయిర్న్స్ను అక్రం అవుట చేశాడు.
వసీం అక్రం, లాన్స్ కెయిర్న్స్, క్రిస్ కెయిన్స్

76 పరుగులు చేసిన క్రిస్‌ను అవుట్ చేయడం ద్వారా తండ్రీకొడులకు అవుట్ చేసిన రెండో బౌలర్‌గా ఖ్యాతికెక్కాడు. క్రైస్ట్‌చర్చ్‌లో కివీస్‌తో జరిగిన టెస్టులో పాకిస్థాన్ 161 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అక్రమ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసుకున్నాడు. 1985-2002 మధ్య పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించిన అక్రం విజయవంతమైన టెస్టు బౌలర్లలో ఒకడు.104 మ్యాచులు ఆడి 181 ఇన్నింగ్స్‌లలో 414 వికెట్లు పడగొట్టాడు.
సైమన్ హార్మర్
దక్షిణాఫ్రికా కుడి చేతివాటం ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్(simon harmer) పేరున కూడా ఇలాంటి రికార్డే ఉంది.టెస్టుల్లో తండ్రీకొడుకులను అవుట్ చేసిన మూడో బౌలర్ అతడే. విండీస్ లెజెండ్ బ్యాటర్ శివనరైన్ చందర్‌పాల్, ఆయన కుమారుడు తేజ్‌నరైన్ చందర్‌పాల్‌ను అవుట్ చేయడం ద్వారా హార్మర్ ఈ ఘతన సాధించాడు. వెస్టిండీస్‌తో కేప్‌టౌన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శివనరైన్ను సైమన్ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ప్రొటీస్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
సైమన్ హార్మర్

ఈ టెస్టులో సైమన్ మొత్తంగా ఏడు వికెట్లు సాధించి అరంగేట్ర టెస్టును మధురజ్ఞాపకంగా మార్చుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో విండీస్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించింది. జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో తేజ్‌నరైన్ చందర్‌పాల్‌ను పెవిలియన్ పంపాడు. దాంతో, తండ్రీ కొడుకులను అవుట్ చేసిన మూడో టెస్టు బౌలర్‌గా సైమన్ చరిత్ర సృష్టించాడు.
మిచెల్ స్టార్క్
ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్(mitchell starc) కూడా తండ్రీ కొడుకులను అవుట్ చేసిన రికార్డు సాధించాడు. శివ్‌నరైన్, తేజ్‌నరైన్ చందర్‌పాల్‌ను అతను అవుట్ చేశాడు. 2012లో విండీస్ పర్యటనలో విండోసోర్లో జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శివనరైన్ను స్టార్క్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 2022లో విండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది.
మిచెల్ స్టార్క్, శివ్‌నరైన్, తేజ్‌నరైన్ చందర్‌పాల్

పెర్త్‌లో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 45 పరుగులు చేసిన తేజ్నరైన్ను బౌల్డ్ చేశాడు. ఫలితంగా తండ్రీకొడుకుల వికెట్లు అతడి ఖాతాలో చేరాయి. స్టార్క్ 80 టెస్టుల్లో 323 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియా ఐదో అత్యుత్తమ బౌలర్‌గా ఖ్యాతికెక్కాడు.
ఇవి కూడా చదవండి
Tiger Woods | గోల్ఫ్ కింగ్ టైగర్ వుడ్స్‌కు ఊరట.. రూ.200 కోట్ల దావాపై వెనక్కి తగ్గిన మాజీ ప్రేయసి
Team India – Pakistan | టెస్టు ర్యాంకింగ్స్‌లో దాయాది జట్ల జోరు.. తొలిసారి అగ్రస్థానంలో భారత్, పాకిస్థాన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

