సీజేఐగా అత్యల్ప కాలం పనిచేసిందెవరెవరో తెలుసా?
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఇవాళ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే వంద రోజుల కన్నా తక్కువ కాలం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవీ బాధ్యతలు చేపట్టిన వారి జాబితాను ఒకసారి పరిశీలిద్దాం. ఇవాళ సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ లలిత్ ఈ ఏడాది నవంబర్ 8వ తేదీ వరకు ఆ పదవిలో ఉండనున్నారు. అంటే ఆయన 74 రోజుల పాటు సీజేగా బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు. 100 రోజుల్లోపు రిటైర్ కానున్న సీజేల్లో ఆరవ వ్యక్తిగా జస్టిస్ లలిత్ నిలవనున్నారు. సాధారణంగా సుప్రీం కోర్టు జడ్జీలు 65 ఏళ్లుకు రిటైర్ అవుతారు. ఇక హైకోర్టు జడ్జీలు మాత్రం 62 ఏళ్లకు రిటైర్ అవుతుంటారు.
ఇక అత్యల్ప కాలం సీజేగా చేసిన మిగితా సీజేల వివరాలను తెలుసుకుందాం. జస్టిస్ కమల్ నరైన్ సింగ్ అతి తక్కువ రోజులు సీజేగా చేశారు. ఆయన కేవలం 18 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. 1991, నవంబర్ 25వ తేదీ నుంచి 1991 డిసెంబర్ 12వ తేదీ వరకు సీజేఐగా జస్టిస్ కమల్ చేశారు. ఇక జస్టిస్ ఎస్ రాజేంద్ర బాబు 30 రోజుల పాటు సీజేఐగా చేశారు. 2004 మే 2వ తేదీ నుంచి 2004 మే 31 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత జస్టిస్ జే సీ షా 36 రోజుల పాటు సుప్రీం సీజేగా చేశారు. 1970, డిసెంబర్ 17వ తేదీ నుంచి 1971 జనవరి 21 వరకు సీజే బాధ్యతల్ని నిర్వర్తించారు.
జస్టిస్ జేబీ పట్నాయక్ 41 రోజుల పాటు సుప్రీంకోర్టు సీజేగా చేశారు. 2002, నవంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఆయన ఆ బాధ్యతల్ని నిర్వర్తించారు. జస్టిస్ ఎల్ ఎం శర్మ 86 రోజుల పాటు సీజేఐగా చేశారు. 1992 నవంబర్ 18వ తేదీ నుంచి 1993 ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఆయన ఆ బాధ్యతల్ని నిర్వర్తించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

