Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు?
Ramayana | ప్రస్తుతం సినీ ప్రేక్షకుల్లో ‘రామాయణం’ సినిమా గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో జటాయువు ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. జటాయువు పాత్రను తెరపై ఆవిష్కరించిన తీరు, రావణుడితో పోరాడే సన్నివేశాలు, ఆ ఘట్టంలోని భావోద్వేగాలు, అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
Ramayana | ప్రస్తుతం సినీ ప్రేక్షకుల్లో ‘రామాయణం’ సినిమా గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో జటాయువు ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. జటాయువు పాత్రను తెరపై ఆవిష్కరించిన తీరు, రావణుడితో పోరాడే సన్నివేశాలు, ఆ ఘట్టంలోని భావోద్వేగాలు, అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో జటాయువు పాత్ర ఆధారంగా ఓ ప్రత్యేక చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్న నిర్మాత దిల్‌రాజు పేరు మరోసారి తెరపైకి వచ్చింది. రామాయణంలో జటాయువు పాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది. సీతాదేవిని అపహరించి తీసుకెళ్తున్న రావణుడిని అడ్డుకునేందుకు జటాయువు ధైర్యంగా పోరాడుతుంది. వయసు మీద పడినా, రావణుడి బలానికి ఎదురొడ్డి నిలుస్తుంది.
చివరకు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకున్నా.. శ్రీరాముడికి సీతాదేవి ఆచూకీ చెప్పి తన బాధ్యతను నెరవేరుస్తుంది. ఈ త్యాగం, ధైర్యం, భక్తి వంటి అంశాలతో జటాయువు కథను వెండితెరపై అద్భుతంగా చూపించే అవకాశం ఉంది. గతంలోనే ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ కథతో భారీ మైథలాజికల్ ఫాంటసీ చిత్రాన్ని రూపొందించాలని ఆలోచించినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రాజెక్టుకు ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించనున్నారనే వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి. కథ, కథనాలపై కసరత్తు చేయడంతో పాటు ప్రీ ప్రొడక్షన్, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌పై సుమారు రెండేళ్ల పాటు పని చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరిగింది.
జటాయువు త్యాగాన్ని ప్రధానంగా తీసుకుని, రామాయణంలోని ఆ ఘట్టాన్ని భిన్నమైన కోణంలో చూపించాలని చిత్ర బృందం భావించినట్లు వార్తలు వచ్చాయి. భారీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను రూపొందించాలనుకున్నారట. అయితే ఈ కథకు అవసరమైన భారీ బడ్జెట్, సాంకేతిక సవాళ్ల కారణంగా ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదనే ప్రచారం ఉంది. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ ప్రాజెక్టు గురించి చర్చ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ‘రామాయణం’ సినిమాలో జటాయువు ఎపిసోడ్‌కు వస్తున్న స్పందనతో దిల్‌రాజు పాత ప్రణాళిక మరోసారి చర్చనీయాంశంగా మారింది. జటాయువు పాత్రకు ఉన్న ప్రాధాన్యత, ఆ ఘట్టంలోని భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఈ కథను ప్రత్యేక సినిమాగా తీస్తే మంచి ఆదరణ దక్కుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే దిల్‌రాజు నిజంగానే జటాయువు కథతో సినిమా నిర్మించేందుకు మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారా? ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ ప్రాజెక్టులో భాగమవుతారా? అనే విషయాలపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు. ప్రస్తుతం వినిపిస్తున్నవన్నీ ప్రచారాలే. నిర్మాత నుంచి ప్రకటన వస్తేనే ఈ ప్రాజెక్టుపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు వస్తున్న ఆదరణతో ఈ పౌరాణిక పాత్ర ఆధారంగా ప్రత్యేక సినిమా వస్తుందా? అనే ఆసక్తి టాలీవుడ్లో మళ్లీ మొదలైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

