థర్డ్‌వేవ్ ముట్టడిస్తే ఢిల్లీలో రోజుకు 45 వేల కేసులు

న్యూఢిల్లీ: సెకండ వేవ్ ముగిసిపోతున్న సూచనల మధ్య ఢిల్లీలో లాక్డౌన్ సడలింపుల గురించి ఆప్ సర్కారు ఆలోచిస్తున్నది. కానీ థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉన్నదని ఐఐటీ-ఢిల్లీ ఒక అధ్యయన నివేదికలో హెచ్చరించింది. ఈ వేవ్‌లో రోజుకు 45 వేల కేసులు రావచ్చని, 9 వేల మందికి హాస్పిటల్ బెడ్ అవసరం కావచ్చని నివేదిక తెలిపింది. శుక్రవారం ఈ నివేదికను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే రోజుకు 944 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని సూచించింది. న్యాయమూర్తులు విపిన్ సంఘీ, జస్మీత్ సింగ్‌తో కూడిన ధర్మాసనం నివేదికలో చేసిన సిఫారసులపై నాలుగు వారాల్లోగా కార్యాచరణ పట్టికను సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆక్సిజన్ కేంద్రాల వికేంద్రీకరణ అనేది నివేదికలోని కీలక సిఫారసుల్లో ఒకటని కోర్టు అభిప్రాయపడింది. ఒకే చోట ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పి సిలిండర్లు రవాణా చేసే బదులు దేశ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఆక్సిజన్ యూనిట్లు నెలకొల్పాలని నివేదిక సూచించింది. శతాబ్దానికి ఒకసారి వచ్చే మహాగత్తరను ఎదుర్కొంటున్నాం.. చివరిసారిగా 1920లో ఇలాంటిది వచ్చింది. ఆక్సిజన్ ఉత్పాదక కేంద్రం నెలకొల్పడానికి ఢిల్లీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దానివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. దీనివల్ల నిల్వచేయడం, రవాణా, ఆవిరై పోవడం వంటి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

