ఢిల్లీ యాసిడ్ దాడి ఘటన.. ఫ్లిప్‌కార్టుకు నోటీసులు జారీచేసిన కేంద్రం
Flipkart | దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏండ్ల బాలికపై యాసిడ్ దాడి ఘటనలో ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌కు (Flipkart) కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్లో
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏండ్ల బాలికపై యాసిడ్ దాడి ఘటనలో ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌కు (Flipkart) కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్లో యాసిడ్ అమ్మినందుకుగాను వివరణ ఇవ్వాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారల మంత్రిత్వ శాఖ ఫ్లిప్‌కార్టును ఆదేశించింది. ఏడు రోజుల్లోగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో యాసిడ్ లభ్యతపై నెలకొన్న భయాందోళనలను పరిష్కరించడానికి అవసరమైన పత్రాలతోపాటు ప్రతిస్పందనను తెలియజేయాలని మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) కోరింది. ఆన్లైన్లో యాసిడ్‌ను విక్రయించడం నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆక్షేపించింది. ఈ నెల 14న ఢిల్లీలో బాలికపై జరిగిన ఘటనలో నిందితులు ఫ్లిప్‌కార్టులో యాసిడ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఢిల్లీ మహిళా కమిషన్ కూడా ఈ-కామర్స్ వేదికలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 9 గంటలకు చెల్లితో కలిసి పాఠశాలకు వెళ్తున్న 17 ఏండ్ల బాలికపై ఇద్దరు యువకులు యాసిడ్ దాడి చేశారు. ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లోని మోహన్ గార్డెన్ సమీపంలో బాధితురాలు వెళ్తుండగా.. ముఖానికి ముసుగులతో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపైనే ఈ దురాగతానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు సఫ్దార్జంగ్ దవాఖానకు తరలించారు.
ముఖంతో పాటు కండ్లలో కూడా యాసిడ్ పడిందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి స్థిరంగా ఉన్నదని వైద్యులు పేర్కొన్నారు. కాగా, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

