హనుమంతుని జన్మస్థలంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ

తిరుమల: హనుమంతుని జన్మస్థలంపై జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో టీటీడీకి, హనుమాన్ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్టుకు మధ్య చర్చ జరిగింది. గురువారం జరిగిన చర్చలో టిడిపి సాంస్కృతిక విద్యాపీఠం వీసీ మురళీధర్ శర్మ, టీటీడీ ప్రత్యేక కార్య నిర్వహణాధికారి ధర్మారెడ్డి, హనుమాన్ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్టు తరఫున గోవిందానంద స్వామి పాల్గొన్నారు. టీటీడీ ఆధారాల్లో తప్పులు ఉన్నాయని స్వామి గోవిందానంద సరస్వతి అన్నారు. టీటీడీ పూర్తి నివేదిక అందిస్తే తప్పులు చూపిస్తానని పేర్కొన్నారు. స్వామీజీకి నివేదిక ఇవ్వడానికి టీటీడీ నిరాకరించింది. అంజనాదేవి తిరుమలలోనే హనుమంతుడికి జన్మనిచ్చిందనేది టిటిడి వాదన. కాదు హనుమంతుడు కిష్కింధలోనే జన్మించాడని గోవిందానంద స్వామిజీ వాదన. పూర్తి నివేదిక ఇస్తేనే మాట్లాడతానని గోవిందానంద స్వామీజీ పట్టుబట్టడంతో చర్చ అసంపూర్తిగా ముగిసింది.గత ఏప్రిల్ 13న ఉగాది సందర్భంగా టీటీడీ తిరుమలలోని అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలమని ప్రకటించింది. శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సన్నిధానం సుదర్శన శర్మ నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల నిపుణుల కమిటీ 2020 డిసెంబర్ లో ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ప్రకటన వెలువడింది. అనేకసార్లు సమావేసమైన కమిటీ ప్రాచీన గ్రంథాల నుంచి సేకరించిన ఆధారాలతో నివేదికను రూపొందించి టీటీడీకి సమర్పించింది. కర్నాటకలోని శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మే నెల మొదటివారంలో టీటీడీ వాదనను ప్రశ్నిస్తూ ఆరు పేజీల లేఖను రాసింది. కమిటీ నివేదిక భక్తులను తప్పుదారి పట్టించేదిగా ఉందని పేర్కొన్నది. కర్నాటకలోనిు కొప్పల్లో కిష్కింధ పర్వతాల్లో హనుమంతుడు జన్మించినట్టు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ట్రస్టు స్పష్టం చేసింది. వాల్మీకి రామాయణంతో పాటుగా పలు ఇతర గ్రంథాల నుంచి సాక్ష్యాలను ఉటంకించారు. దానికి జవాబుగా టీటీడీ బహిరంగ చర్చకు సవాల్ చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

