సిడ్నీ: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరీ ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ హెడ్ కోచ్‌గా ఆండ్రూ మెక్‌డోనాల్డ్ ఉన్నారు. కివీస్ జట్టు తరపున ఆల్రౌండరీ వెటోరీ 113 టెస్టులు, 295 వన్డేలు ఆడాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాజీ కోచ్ జస్టిస్ లాంగర్ తప్పుకోవడంతో అతని స్థానంలో మెక్డోనాల్డ్ను కోచ్‌గా నియమించారు. గతంలో వెటోరీతో పనిచేశానని, అతనికి గురించి తనకు ఎంతో తెలుసు అని కోచ్ డోనాల్డ్ తెలిపారు. వెటోరీతో పాటు ఆండ్రూ బోరవిక్లను మెన్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌లుగా తీసుకున్నారు. జూన్‌లో శ్రీలంకతో ప్రారంభం అయ్యే టెస్ట్ సిరీస్ సమయంలో వెటోరీ తన బాధ్యతలు స్వీకరించనున్నాడు. గతంలో వెటోరీ పలు జట్లకు కోచింగ్ సేవలు అందించాడు. బంగ్లాదేశ్ జట్టుకు స్పిన్ బౌలింగ్ కాన్సల్టెంట్గా చేశాడు. సీపీఎల్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్, బిగ్ బాష్‌లో బ్రిస్బేన్ హీట్, ఐపీఎల్లో ఆర్సీబీ, కౌంటీలో మిడిల్సెక్స్ జట్లుకు కోచ్‌గా చేశాడు.