కీరదోసతో మధుమేహాన్ని అదుపులో పెట్టొచ్చు..!

హైదరాబాద్: మధుమేహం ఒక దీర్ఘకాలిక వ్యాధి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్నది. అధిక కేలరీలున్న ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేని జీవనశైలి, బరువు పెరుగడం లాంటివి మధుమేహం విస్తరణకు ప్రధాన కారణాలు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. అందులోభాగంగా ఇప్పుడు కీరదోసకాయ మధుమేహం నియంత్రణకు ఏవిధంగా తోడ్పడుతుందో తెలుసుకుందాం..!
- ఒక అధ్యయనం ప్రకారం.. కీరదోస కాయలు శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపిస్తాయి. ఇవి హైపర్ గ్లైసీమియా, మంటను నియంత్రించడంలో కూడా సహాయపడుతాయి.
- కీరదోసవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కీరదోసను తరచూ తీసుకోవడంవల్ల శరీరంలో కొవ్వులు తగ్గిపోతాయి. దాంతో బరువు తగ్గడంతోపాటు డయాబెటిస్ కూడా తగ్గిపోతుంది.
- దోసకాయల్లోని యాంటీ-హైపర్ గ్లైసిమిక్ ప్రభావం గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి, మధుమేహాన్ని నియంత్రించడానికి సాయపడుతుంది.
- దోసకాయలపై తొక్కలు కూడా మధుమేహులకు ఎంతో మేలు చేస్తాయట. ఎందుకంటే దోస తొక్కల్లో ఆస్కార్బిక్ ఆమ్లం, పాలీఫెరాల్స్, ఫ్లవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మధుమేహాన్ని అదుపు చేయడంతో కీలకపాత్ర పోషిస్తాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

