MS Dhoni: రిటైర్మెంట్పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో
MS Dhoni: వచ్చే ఐపీఎల్లో ఆడే విషయం తన బాడీ ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని ధోనీ అన్నాడు. మరో ఆరు లేదా ఏడు నెలల తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నాడు. ఒకవేళ వచ్చే సీజన్లో ఆడగలిగితే అప్పుడు అది తన అభిమానులకు గిఫ్ట్ అవుతుందన్నాడు.
అహ్మాదాబాద్: ఐపీఎల్ కెరీర్‌కు స్వస్తి పలికేందుకు ధోనీ(Dhoni) సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల కొన్ని సంకేతాలు అందిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభంలోనూ ఓ మ్యాచ్‌లో ధోనీ ఫిట్నెస్ సమస్యతో ఇబ్బందిపడ్డాడు. అయితే ఇక ధోనీ రిటైర్ అవుతాడని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ యేటి ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై జట్టు సొంతం చేసుకున్నది. ఐపీఎల్ ట్రోఫీని అయిదోసారి గెలిచిన తర్వాత ధోనీ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో రిటైర్మెంట్పై అడిగిన ప్రశ్నకు ధోనీ బదులిచ్చాడు.
తానేమీ ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించడం లేదని ధోనీ తెలిపాడు. 41 ఏళ్ల ధోనీ రాబోయే తొమ్మిది నెలలు తన ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టనున్నట్లు వెల్లడించాడు. వీలైనంత వరకు వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడేందుకు ప్రయత్నించనున్నట్లు తెలిపాడు. తన అభిమానులకు తన ఆటను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు.
The interaction you were waiting for 😉
MS Dhoni has got everyone delighted with his response 😃 #TATAIPL | #Final | #CSKvGT | @msdhoni pic.twitter.com/vEX5I88PGK
— IndianPremierLeague (@IPL) May 29, 2023
వాస్తవానికి రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇది ఉత్తమ సమయం అని, కానీ ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమ, అభిమానం అనిర్వచనీయమని, వారికి థ్యాంక్స్ చెప్పడం ఈజీ పని అని, కానీ రాబోయే 9 నెలల మళ్లీ ప్రిపేర్ కావడం చాలా కష్టమైన పని అని ధోనీ తెలిపాడు. తాను వచ్చే ఐపీఎల్ ఆడే విషయం తన శరీరంపై ఆధారపడి ఉంటుందన్నాడు. మరో ఆరు లేదా ఏడు నెలల తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నాడు. ఒకవేళ వచ్చే సీజన్లో ఆడగలిగితే అప్పుడు అది గిఫ్ట్ అవుతుందన్నాడు.
Read More..
IPL 2023: ధోనీ.. జీవా.. భావోద్వేగ క్షణాలు.. ఆ బ్యూటీఫుల్ వీడియో చూడాల్సిందే
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

