రామగుండం : రామగుండం పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ( Amber Kishore Jha ) తెలిపారు. వర్షాకాలంలో విధి నిర్వహణకు ఉపయోగపడే రెయిన్కోట్ల ( Raincoats ) ను కమిషనర్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ఎండనకా, వాననకా రాత్రింబవళ్లు కష్టపడి విధులు నిర్వహించే సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో రెయిన్కోట్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. విధి నిర్వహణ సమయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి సమర్ధవంతంగా బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కె.శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శేఖర్,మల్లేశం,రమేష్ పాల్గొన్నారు.