బెంగళూరు వెళ్తే.. ఇక కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి..

బెంగళూరు : పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రాష్ట్రం వెలుపలి నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తున్నది. వచ్చే నెల నుంచి బెంగళూరుకు వస్తే కొవిడ్ నెగెటివ్ ఆర్టీ పీసీఆర్ పరీక్ష రిపోర్ట్ వెంట తీసుకురావాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర మంత్రి కే సుధాకర్ స్పష్టం చేశారు. బెంగళూరులో బుధవారం 1400, గురువారం 1623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలల తర్వాత ఈ మొత్తం కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇటీవల పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని, అయితే రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల్లోనే ఎక్కువగా వైరస్ జాడలు కనిపిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు ఉండగా.. వచ్చే నెల నుంచి అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందన్నారు. వైరస్ బారినపడ్డ వారిని గుర్తించి.. వేరే చేసేందుకు పాజిటివ్‌గా పరీక్షించిన వారి చేయిపై స్టాంప్ వేయాలని నిర్ణయించారు. వైరస్ ఉధృతి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. రాబోయే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసుల పెరుగుదల నేపథ్యంలో అవసరమైన పడకలను హాస్పిటళ్లలో పెంచనున్నట్లు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

