ఐపీఎల్ : బెంగళూరు జట్టుకు షాక్.. కరోనా బారిన మరో ఆటగాడు
ఐపీఎల్ బెంగళూరు జట్టు | ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభానికి ముందే రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో షాక్ తగిలింది. ఈ నెల 9న చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్‌తో సీజన్ ప్రారంభ మ్యాచ్‌కు ముందే మరో ఆటగాడు కరోనా వైరస్ పాజిటివ్‌గా బారినపడ్డారు.

చెన్నై : ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభానికి ముందే రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో షాక్ తగిలింది. ఈ నెల 9న చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్‌తో సీజన్ ప్రారంభ మ్యాచ్‌కు ముందే మరో ఆటగాడు కరోనా వైరస్ బారినపడ్డారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ వైరస్ పాజిటివ్‌గా తేలారు. దీంతో అతన్ని ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఆర్సీబీ జట్టు ప్రకటించింది. ఇప్పటికే జట్టుకు చెందిన ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్ష చేశారు.
డేనియల్ సామ్స్‌కు ఈ నెల 3న చైన్నైలోని హోటల్లో కొవిడ్ పరీక్షలు చేశారు. అప్పుడు నెగెటివ్ నివేదిక వచ్చింది. తాజాగా మరోసారి రెండోసారి పరీక్షలు చేయగా సానుకూలంగా వచ్చింది. అయితే, లక్షణాలు ఏవీ లేవని, ఐసోలేషన్‌లో ఉన్నాడని ఆర్సీబీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. బీసీసీఐ ప్రోటోకాల్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వైద్య బృందం డేనియల్ సామ్స్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, బీసీసీఐ ప్రొటోకాల్స్ మేరకు అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుందని చెప్పింది.
ఐపీఎల్-2021 సీజన్ సైతం సవ్యంగా సాగేలా కనిపించడం లేదు. గత ఏడాది కరోనా నేపథ్యంలో దుబాయ్‌లో టోర్నీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సారి సీజన్‌ను సైతం కరోనా వెంటాడుతోంది. టోర్నీ ప్రారంభానికి మరో రెండురోజుల సమయమే ఉంది. ఇప్పటికే పలు జట్లుకు చెందిన ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఢిల్లీ క్యాపిటల్స్‌లో అక్షర్ పటేల్, బెంగళూరు జట్టులో వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేశారు. మళ్లీ నెగెటివ్ రావడంతో పడిక్కల్ శిబిరంలో చేరాడు. కోల్‌కతా ఆటగాడు నితీశ్ రాణే కొవిడ్ నుంచి కోలుకొని జట్టుతో కలిశాడు. అలాగే ముంబైలోని వాంఖడే మైదానం సిబ్బంది పదుల సంఖ్యలో వైరస్ బారిన పడ్డారు. ముంబై ఇండియన్స్ సలహాదారు కిరణ్ మోరేకు సోమవారం వైరస్ సోకింది. ఈ క్రమంలో టీమ్ మేనేజ్మెంట్ అందరికీ పరీక్షలు చేయించింది. నెగెటివ్ రిపోర్ట్ రావడంతో ఆరంభ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టు ఊపిరిపీల్చుకుంది.
Official Statement: Daniel Sams checked into the team hotel in Chennai on April 3rd, with a negative COVID report on arrival. His report from the 2nd test on 7th April came positive. Sams is currently asymptomatic and he is currently in isolation at a designated medical facility.
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 7, 2021
Bold Diaries: Devdutt Padikkal joins the RCB camp after testing negative for COVID-19. He’s healthy, feeling better and raring to go. Here’s a message to all RCB fans from Devdutt.#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/BtVszNABJW
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 7, 2021
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన సోనుసూద్
కరోనా డేంజర్ బెల్స్.. 24గంటల్లో 1.15లక్షల కేసులు
శంషాబాద్‌లో బంగారం పట్టివేత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

