న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా వంటనూనెకు అత్యంత డిమాండ్ ఉంది. కానీ, ఆయిల్ పామ్ పంట సాగు అందుకు తగినట్టుగా లేకపోవడంతో చాలా దేశాలు వంటనూనె కొరతను ఎదుర్కొంటున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నాయి. ఈ కొరత తీర్చేందుకు యూఎస్‌లోని న్యూయార్క్‌కు చెందిన సీ16 బయోసైన్సెస్ కంపెనీ ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నది.
ప్రయోగశాలలో పరిశోధకులు ఈస్ట్ కణాలతో పామాయిల్‌ను తయారు చేశారు. ఈ నూనె తయారీకి మెట్ష్నికోవియా పుల్చుర్రిమా లేదా ఎంపీ అనే ప్రత్యేకమైన ఈస్ట్ జాతిని ఉపయోగించారు. గడ్డి లేదా ఆహార వ్యర్థాలపై ఈస్ట్‌ను పంపడం ద్వారా కేవలం ఏడురోజుల్లోనే పామాయిల్ తయారవుతుంది. అదే ఆయిల్ పామ్ సాగు పద్ధతిలో పామాయిల్ తయారు చేయాలంటే ఏడేండ్లు పడుతుందని, ప్రపంచ పామాయిల్ కొరత తీర్చేందుకు తమ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని కంపెనీ సీఈవో తెలిపారు.