Hyderabad | మెగా విజయ డెయిరీకి శంకుస్థాపన

మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో అంతర్జాతీయస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న మెగా డెయిరీకి శుక్రవారం పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి భూమిపూజ చేశారు. 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో దీనిని నిర్మించనున్న డెయిరీ రెండేండ్లలో నిర్మాణం పూర్తి చేసి, ఉత్పత్తుల తయారీ ప్రారంభించాలన్నది లక్ష్యం. డెయిరీ నిర్మాణంలో విశేష అనుభవం ఉన్న నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ)కు నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
మెగా డెయిరీతో పాలఉత్పత్తి సామర్థ్యం రెండు నుంచి మూడు రెట్లు పెరిగనుంది. 75 వేలమంది పాడి రైతులకు సభ్యత్వం ఉన్న విజయ డెయిరీ.. పీక్ సీజన్లో రోజుకు 4.5 లక్షల లీటర్లు, వేసవిలో 2.5 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నది. కాగ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఈకార్యక్రమంలో విజయడెయిరీ చైర్మన్ లోక భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీలు సురభివాణిదేవి, యెగ్గెమల్లేశం రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అనితారాజేందర్, కలెక్టర్ అమోయ్‌కుమార్, విజయడెయిరీ ఎండీ శ్రీనివాసరావు తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమోహన్,వైస్ చైర్మన్ భవాని వెంకట్‌రెడ్డి,కమిషనర్ జ్ఞానేశ్వర్ కౌన్సిలర్లు వివిద శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

