పశువుల సంతలో నకిలీ రసీదు బుక్కులతో వసూళ్లు

మహబూబ్‌నగర్
: జిల్లాలోని దేవరకద్ర పశువుల సంతలో నకిలీ రసీదు బుక్కులతో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ఈ విషయంపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. దేవరకద్ర మండల కేంద్రంలో ప్రతి బుధవారం నిర్వహించే పశువుల సంతను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
దేవరకద్ర పశువుల సంత పశువుల క్రయవిక్రయాలకు ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా ఇక్కడికి జిల్లా నుంచే కాక ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పశువుల క్రయవిక్రయాలకు కొనుగోలుదారులు, అమ్మకందారులు వస్తుంటారు. కరోనా కారణంగా పశువుల సంత టెండర్ దక్కించుకున్న గుత్తేదారు మధ్యలోనే విరమించుకున్న కారణంగా ప్రస్తుతం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలోనే పశువుల సంతలో పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే దీన్ని ఆసరా చేసుకుని బయటి వ్యక్తులు కొందరు నకిలీ రసీదు పుస్తకాలను తయారు చేయించి ప్రతి బుధ వారం పశువుల సంతలో క్రయ విక్రయదారుల నుంచి పన్ను రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు.
పక్కా సమాచారం అందుకున్న అదనపు కలెక్టర్ బుధవారం పశువుల సంత ను ఆకస్మికంగా తనిఖీ చేయడమే కాకుండ 4 నకిలీ రసీదు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడమే కాక ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా నకిలీ రసీదు బుక్కులు సృష్టించి డబ్బులు వసూలు చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై సమగ్ర విచారణ నిర్వహించి సంబంధితుల పై తగు చర్య తీసుకొనున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

