అటకెక్కిన ‘అల్పాహారం’
రాష్ట్రంలోనే మొదటిసారిగా రంగారెడ్డిజిల్లా మంచాల మండలం ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాలుగు నెలల క్రితం ఆర్భాటంగా ప్రారంభించిన అల్పాహార కార్యక్రమం ఆదిలోనే అటకెక్కింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తామని ప్రగల్భాలతో ప్రవేశపెట్టిన అల్పాహార పథకం ఆచరణలో నీరుగారిపోతున్నది.
రంగారెడ్డి, నవంబర్ 12 (నమస్తేతెలంగాణ) / మంచాల : రాష్ట్రంలోనే మొదటిసారిగా రంగారెడ్డిజిల్లా మంచాల మండలం ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాలుగు నెలల క్రితం ఆర్భాటంగా ప్రారంభించిన అల్పాహార కార్యక్రమం ఆదిలోనే అటకెక్కింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తామని ప్రగల్భాలతో ప్రవేశపెట్టిన అల్పాహార పథకం ఆచరణలో నీరుగారిపోతున్నది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం దోశ, ఇడ్లీ, ఉప్మాతో పాటు పాలు అందించేవారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభమైన పథకం రెండు నెలలకే నిలిచిపోవడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలో టిఫిన్ పెడ్తారని విద్యార్థులు ఇంటిదగ్గర తినకుండా వచ్చి పస్తులు ఉంటున్నారు. టిఫిన్స్, మధ్యాహ్నభోజనం, స్నాక్స్ అందించాల్సి ఉన్నప్పటికీ సిబ్బంది అందిన కాడికి దోచుకుని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనంతోపాటు సాయంత్రం స్నాక్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

