మనసు కుదుటపడేలా.. మనోధైర్యాన్ని నింపిన కేసీఆర్
కేసీఆర్ | సికింద్రాబాద్‌లోని గాంధీ దావఖాన.. ఇప్పుడో కోవిడ్ సెంటర్. మహ్మమ్మారి బారిన పడ్డవారికి అదే కీలక చికిత్సాలయం. ఆ ఆలయాన్ని ఇవాళ సీఎం

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని గాంధీ దావఖాన.. ఇప్పుడో కోవిడ్ సెంటర్. మహ్మమ్మారి బారిన పడ్డవారికి అదే కీలక చికిత్సాలయం. ఆ ఆలయాన్ని ఇవాళ సీఎం కేసీఆర్ సందర్శించారు. దాదాపు గంట సేపు గాంధీ హాస్పిటల్లో ఆయన గడిపారు. కరోనా వైరస్ సోకిన రోగులు చికిత్స పొందుతున్న వార్డుల్లో కేసీఆర్ పర్యటించారు. మెరుపు దాడి చేసిన కరోనా నుంచి కోలుకుంటున్నవారిని ఆయన పలుకరించారు. కరోనా ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్లతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వారి వారి బంధువులతోనూ ఆయన ముచ్చటించారు. అక్కడ ఉన్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. చికిత్స ఎలా అందుతోంది.. ఇంకేం కావాలన్న అభిప్రాయాలను ఆయన తెలుసుకున్నారు. కరోనా రోగుల మనసు కుదుటపడేలా .. కేసీఆర్ వారిని పరామర్శించారు. వారిలో ధైర్యాన్ని నింపారు. చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న భరోసా ఇచ్చారు.

ఔట్ పేషెంట్ వార్డులో కూడా సీఎం కేసీఆర్ కలియతిరిగారు. అక్కడ కోవిడ్ చికిత్స పొందుతున్నవారిని .. వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా రోగులకు మనోధైర్యమే మందు. ఆ ధైర్యాన్ని రోగుల్లో నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్. ప్రతి ఒక పేషెంట్‌ను పలుకరిస్తూ..వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఔషధాలే కాదు.. నమ్మకమైన మాట కూడా వైద్యానికి కీలకమన్న సందేశాన్ని ఆయన వినిపించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంక్షేమ గురించి ప్రభుత్వం పట్టింపుతో ఉందన్న సంకేతాలను సీఎం కేసీఆర్ తన పర్యటన ద్వారా తెలిపారు.

కేవలం రోగులను పలుకరిచడమే కాదు.. గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, జూనియర్ డాక్టర్లతోనూ సీఎం కేసీఆర్ మాట్లాడారు. వారికి కూడా ఆయన బలమైన నమ్మకాన్ని ఇచ్చారు. ఆక్సిజన్, ఔషధాల కొరత రాకుండా చూడాలన్నారు. విపత్కర సమయంలో వైద్యం అందిస్తున్న డాక్టర్లను సీఎం కేసీఆర్ అభినందించారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన ప్రభుత్వ ఆస్పత్రిగా నిలిచిన గాంధీ హాస్పిటల్‌ను మరింత ఆధునీకరించేందుకు కేసీఆర్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

గాంధీ దవాఖానలోని కోవిడ్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తులను పరామర్శించిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు. pic.twitter.com/ZxolaKvYlm
— Telangana CMO (@TelanganaCMO) May 19, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

