హైదరాబాద్ : మే 2న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎన్నికల హడావిడి నడిచింది. ఫలితాలు వెలువడటంతో ఎవరు గెలిచారు.. ఎవరు ఓడిపోయారు అనే విషయం తెలుసుకోడానికి ప్రజలు కూడా ఆతృతగా వేచి చూసారు. తమిళనాడు, కేరళ, అసోం, బెంగాల్, పుదుచ్చేరిలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అందులో చాలా మంది సినిమా వాళ్లు కూడా పోటీలో ఉన్నారు. ముఖ్యంగా తమిళనాట అయితే ఏకంగా ఓ పార్టీ పెట్టి మరీ బరిలోకి దిగాడు కమల్ హాసన్. ఆయనతో పాటు మరికొందరు కూడా ఈ సారి ఎన్నికల బరిలో ఉన్నారు. మరివాళ్లలో ఎంతమంది గెలిచారు.. ఎంతమంది ఓడారు అనేది చూద్దాం.
తమిళనాడు: కమల్ హాసన్ : మక్కల్ నీది మయ్యం, పోటీ చేసిన స్థానం: కోయంబత్తూర్, ఫలితం: ఓటమి
ఉదయనిధి స్టాలిన్ : డీఎంకే, పోటీ చేసిన స్థానం : చెపాక్, ఫలితం: గెలుపు
కుష్బూ సుందర్: బీజేపీ, పోటీ చేసిన స్థానం: థౌజెండ్ లైట్స్, ఫలితం: ఓటమి
కేరళ : సురేష్ గోపీ : బీజేపీ, పోటీ చేసిన స్థానం: త్రిసూరు, ఫలితం: ఓటమి
పశ్చిమ బెంగాల్: సయంతిక బెనర్జీ: టీఎంసీ, పోటీ చేసిన స్థానం: బనాకురా, ఫలితం: ఓటమి
యశ్ దాస్ గుప్తా: బీజేపీ, పోటీ చేసిన స్థానం: చండీలా, ఫలితం: ఓటమి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.