e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News నీ ‘నటన’ అద్భుతం

నీ ‘నటన’ అద్భుతం

నీ ‘నటన’ అద్భుతం

వకీల్‌ సాబ్‌ సినిమాపై ప్రశంసల జుల్లు కురుస్తూనే ఉంది. ముఖ్యంగా చిరంజీవి అయితే పేరుపేరునా చిత్రయూనిట్‌ ని అభినందిస్తున్నారు. ఈ సినిమాలో నందాగా నటించిన ప్రకాశ్‌ రాజ్‌ పై ప్రశంసలు కురిపించారు మెగాస్టార్. ఆయన లాంటి నటుడు సినిమాలో ఉన్నప్పుడు మిగిలిన నటుల్లోని ప్రతిభ కూడా బయటపడుతుందన్నారు. వకీల్ సాబ్ చిత్రంలో ప్రకాశ్ రాజ్ అద్భుతంగా నటించారని, పవన్ కల్యాణ్ కు ధీటుగా తన పాత్రల్లో లీనమయ్యారని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇలాగే అలరించాలని ఆకాంక్షించారు.

ఏప్రిల్ 9న వకీల్ సాబ్‌ సినిమా రిలీజైంది. తల్లి, కుటుంబసభ్యులతో పాటు సినిమాని చూసిన మెగాస్టార్‌ వరస ట్వీట్లతో ఇటు వకీల్‌  సాబ్‌ చిత్రయూనిట్‌ ని అటు ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తారు. అంతటితో ఆగలేదు నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు వేణుశ్రీరామ్‌ ని ప్రత్యేకంగా తన ఇంటికి పిలిచి అభినందించారు. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నీ ‘నటన’ అద్భుతం

ట్రెండింగ్‌

Advertisement