సిక్కింలో చైనీస్ ఆర్మీ.. రోడ్లు, పోస్ట్‌ల నిర్మాణం

న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిక్కింలోని నాకూ లా పాస్ దగ్గర చైనీస్ ఆర్మీ రోడ్లు, కొత్త పోస్టులు నిర్మిస్తున్నట్లు శాటిలైట్ ఇమేజ్‌లు బయటపెట్టాయి. గల్వాన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతల తర్వాత నాకూ లా ప్రాంతంలో చైనీస్ ఆర్మీ కార్యకలాపాలు పెరిగాయి. ఈ మధ్య కాలంలో డోక్లాంతోపాటు నాకూ లాలో కూడా ఇండియా, చైనా జవాన్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తాజా శాటిలైట్ ఇమేజ్‌లను ఇండియా టుడే టీవీ బయటపెట్టింది.
ఈ నెల 12వ తేదీ వరకూ కూడా నాకూ లా పాస్ దగ్గర చైనా ఆర్మీ కార్యకలాపాలు ఉన్నట్లు ఈ శాటిలైట్ ఇమేజ్‌లు స్పష్టం చేస్తున్నాయి. ఆ రోజు ఉదయం ఆ ప్రాంతంలో చైనా మిలిటరీ వాహనాలు, కొత్త క్యాంపులు ఉన్నట్లు శాటిలైట్ ఫొటోల్లో తేలింది. గతేడాది సెప్టెంబర్‌లో ఇదే ప్రాంతంలో తీసిన శాటిలైట్ ఇమేజ్‌లో ఎలాంటి నిర్మాణాలు కనిపించకపోగా.. తాజా చిత్రాల్లో చైనా వాహనాలు, క్యాంపుల వంటి నిర్మాణాలు కనిపించాయి. కొత్తగా రోడ్లు నిర్మిస్తున్నట్లు కూడా వీటిలో స్పష్టంగా కనిపించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

