నాటో తీరును సంయుక్తంగా ఖండించిన చైనా, రష్యా
బీజింగ్: నాటో దళాల విస్తరణను ఖండిస్తూ ఇవాళ రష్యా, చైనాలు సంయుక్త ప్రకటన చేశాయి. వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభోత్సవం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు బీజింగ్‌లో భేటీ అయ్యారు. ఆ ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. పశ్చిమ దేశాలకు చెందిన నాటో దళాలు తెస్తున్న వత్తిడిని రెండు దేశాలు ఖండించాయి. తైవాన్ అంశంలో చైనాకు మద్దతుగా నిలుస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఆ ద్వీపకల్పానికి స్వాతంత్య్రాన్ని నిరాకరిస్తున్నట్లు రష్యా చెప్పింది. మరో వైపు ఉక్రెయిన్ అంశంలోనూ నాటో దళాలు చేస్తున్న హడావుడిని రెండు దేశాలు ఖండించాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లడం లేదని రష్యా చెబుతున్నా.. ఆ రెండు దేశాల సరిహద్దుల్లో మాత్రం టెన్షన్ వాతావరణం ఉంది. చాలా స్నేహపూర్వక వాతావరణంలో పుతిన్, జిన్‌పింగ్ మధ్య చర్చలు జరిగినట్లు అధికారులు తెలిపారు. నాటో దళాలు ప్రచ్ఛన్నయుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయని, ఆకస్ సెక్యూర్టీ ఒప్పందం కూడా కలవరపెడుతున్నట్లు రెండు దేశాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- china
- NATO forces
- Putin
- Russia
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

