లార్డ్స్: చతేశ్వర్ పూజారా టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో సస్సెక్స్ తరపున ఆడుతున్న పూజారా.. లార్డ్స్ మైదానంలో మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌కు సారథ్య బాధ్యతలను కూడా పూజారా చేపట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పూజారా డబుల్ సెంచరీ కొట్టడం ఇది 16వ సారి. లార్డ్స్ మైదానంలో మిడిల్సెక్స్ జట్టుపై డబుల్ సెంచరీ కొట్టిన తొలి సస్సెక్స్ బ్యాటర్ కూడా పూజారా కావడం విశేషం. అయితే 125 ఏళ్ల క్రితం ఇదే మైదానంలో సస్సెక్స్ తరపున రంజిత్ సింగ్జీ డబుల్ సెంచరీ కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యధిక స్థాయిలో డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్లలో పూజారా ఇప్పుడు సంయుక్తంగా అయిదో స్థానంలో నిలిచాడు. పూజారాతో పాటు సీబీ ఫ్రై, జాక్ హోబ్స్, గ్రేమీ హిక్ అయిదో స్థానంలో ఉన్నారు.
డబుల్ సెంచరీలు అత్యధికంగా కొట్టిన ప్లేయర్లలో ఆస్ట్రేలియా క్రికెటర్ డాన్ బ్రాడ్‌మాన్ ప్రథమస్థానంలో నిలిచాడు. అతను 37 సార్లు డబుల్ సెంచరీ చేశాడు. ఆ లిస్టులో వాల్టర్ హమ్మాండ్ రెండవ స్థానంలో ఉన్నాడు. అతను 36 సార్లు డబుల్ సెంచరీలు చేశాడు. ఇక మూడవ స్థానంలో ఎలియాస్ హెండ్రిన్ ఉన్నారు. అతను 22 డబుల్ సెంచరీలు చేశాడు.మిడిల్‌సెక్స్‌పై పూజారా 403 బంతుల్లో 231 రన్స్ చేశాడు. దాంట్లో 21 ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి.