వైట్ నాయిస్
‘స్పేస్' అంటే అంతరిక్షమనే అనుకున్నాను ఇన్నాళ్లూ!
‘స్పేస్’ అంటే అంతరిక్షమనే
అనుకున్నాను ఇన్నాళ్లూ!
పర్సనల్ స్పేస్ కావాలంటూ
నువ్వు అల్టిమేటం ఇచ్చేసాక
‘గాడ్జెట్’ల కళ్లతో లోకాన్ని చూసే నీతో యంత్రాల గురించి తప్ప
మమతల మంత్రాల గురించి
ఏమని చెప్పను?
నీ మాటనే సప్తపదిగా భావించి
నీతో నడిచొస్తున్నప్పుడు
ఊరి గుండెను కూడా వెంట తెచ్చానేమో
నాకు నీ తీరు
అర్థంకాని పజిల్ లాగే ఉంది!
కుటుంబాలంటేనే కొన్ని త్యాగాలు..
మరిన్ని ప్రేమలు
సహజీవనం అంటేనే నమ్మకం.. విశ్వాసం
మరణంలో సైతం తోడు వచ్చే
జ్ఞాపకాలే కదా స్నేహాలు…
నీళ్లంటే జీవగంజి
ఆడాళ్లంటే జీవ నాడి
ఆడదంటే ఇవ్వటమే తెలిసిన
అరుదైన జాతి!
ఇన్నేండ్ల తర్వాత
బంధాలన్నీ బంధనాలేనని
సెల్ఫ్ పార్టనర్‌గా ఉంటేనే
జీవితంలో స్వేచ్ఛ ఉంటుందని
కొత్త ప్రవచనాలు మొదలెట్టేశావ్
అనిశ్చితి పెంచే దృశ్యమాధ్యమాలు
అన్నిటి మధ్యా అశాంతి జీవితాలు
ఎన్నెన్ని చూసుంటాం..!
సహచరుడా!
వినోదమైనా, వేదనైనా పంచుకోవటానికి
ఓ మనిషి కావాలి!
మిత్రుడా…
‘వైట్ నాయిస్’ని ఇంకా నా మనసుకు
వినిపించాలని ప్రయత్నించకు
ఉమ్మనీటిలో ఉన్నప్పుడు పొందిన భద్రతని
ఆ సమైక్య ఫ్రీక్వెన్సీల సంగీతంతో
భ్రమింప చేయకు
జగతిలోకి కొత్త తరాన్ని పుట్టించిన దాన్ని
ప్రసవ వేదననే కోరి వరించినదాన్ని
నా కోసం నేను
జీవితాన్ని కొత్తగా మొదలెడతాను
ఇక…
నా ‘స్పేస్’ని నేను సృష్టించుకుంటాను..!
అయినంపూడి శ్రీలక్ష్మీ
99899 28562
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cult Fans Meet | విజయ్ దేవరకొండ, నాని బాటలో విశ్వక్ సేన్.. ‘కల్ట్’ కోసం ఫ్యాన్స్ మీట్!
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

