Chit Fund Scam Case | చిట్‌ఫండ్ స్కామ్ కేసుల్లో బెంగాల్ మంత్రికి సీబీఐ నోటీసులు
Chit Fund Scam Case | చిట్‌ఫండ్ స్కామ్ కేసుల్లో బెంగాల్ మంత్రికి సీబీఐ నోటీసులు |

కోల్‌కతా : ఐ-కోర్ చిట్‌ఫండ్ స్కామ్ కేసులో బెంగాల్ వాణిజ్యం, పరిశ్రమలశాఖ మంత్రి పార్థ ఛటర్జీని విచారణకు రావాలని సీబీఐ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఐ-కోర్ కంపెనీ ఏర్పాటు చేసిన పలు కార్యాక్రమాలకు పార్థ చటర్జీ హాజరైనట్టు ఆరోపణలున్నాయి. ఎక్కువ మొత్తంలో రిటర్నులు వస్తాయంటూ పెట్టుబడిదారుల నుంచి పెద్ద ఎత్తున సొమ్ములు వసూలు చేసి మోసగించారని ఐ-కోర్ మీద ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే మరో కేంద్ర ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బొగ్గు అక్రమ రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సోమవారం ఢిల్లీ కార్యాలయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడిని తొమ్మిది గంటల పాటు విచారించింది. మమతా బెనర్జీ బుధవారం జరిగిన ఓ సమావేశంలో ప్రసంగిస్తూ అభిషేక్ బెనర్జీకి ఈడీ నోటీసుపై కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ ఓటర్ల తీర్పును బీజేపీ అంగీకరించలేదని ఆరోపించారు. తప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. అభిషేక్‌ను ఢిల్లీకి పిలిచి తొమ్మిది గంటల పాటు ప్రశ్నించడం వెనుక కారణం ఏంటీ? అంటూ ప్రశ్నించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
AP News | పంచాయతీ ఎన్నికల పోలింగ్.. కాంగ్రెస్-టీడీపీ బాహాబాహీ..!
Brain Fog | రాత్రి సరిగ్గా నిద్రించినా ఉదయం తల భారంగా ఉంటుందా.. అందుకు కారణాలు ఇవే..
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

