లండన్: బ్రిటన్ ఆరోగ్యశాఖ అధికారులు కోవిడ్ టాప్-అప్ వ్యాక్సిన్(vaccine) ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వృద్ధులు, ఆరోగ్య క్షీణించిన వ్యక్తులకు బూస్టర్ డోస్ ఇవ్వాలని భావిస్తున్నారు. BA.2.86 వేరియంట్(covid variant) కొంత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో.. అక్టోబర్ నుంచి టాప్-అప్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాబోయే వారం నుంచి ఓల్డేజ్ కేర్ హోమ్స్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని నేషనల్ హెల్త్ సర్వీస్ పేర్కొన్నది.
ఇప్పటి వరకు BA.2.86 వేరియంట్ ను ఆందోళనకరమైందిగా ఇంకా బ్రిటన్ ఆరోగ్య శాఖ ప్రకటించలేదు. కానీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వ్యాక్సిన్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. BA.2.86 వేరియంట్ లో మ్యుటేషన్స్ ఎక్కువగా జరుగుతున్నట్లు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం తమ వద్ద ఆ వేరియంట్‌కు చెందిన డేటా తక్కువే ఉన్నట్లు భారతీయ మూలాల ఉన్న డాక్టర్ రేణు బింద్రా తెలిపారు. ఆ వేరియంట్ ద్వారా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరుగుతున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలోనే అర్హులైన వారికి టాప్-అప్ వ్యాక్సిన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.