Year end sale | క్లియరెన్స్ సేల్.. కార్లపై భారీ డిస్కౌంట్లు..!
2022 ముగుస్తుండటంతో ఇయర్ ఎండ్ స్టాక్ క్లియరెన్స్‌లో భాగంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్లు, ఎస్‌యూవీలపై డిసెంబర్లో భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.
న్యూఢిల్లీ : 2022 ముగుస్తుండటంతో ఇయర్ ఎండ్ స్టాక్ క్లియరెన్స్‌లో భాగంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్లు, ఎస్‌యూవీలపై డిసెంబర్లో భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఎంపిక చేసిన వేరియంట్స్‌పై ఆయా కంపెనీలు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. కొత్త ఏడాదిలో కారు కొనుగోలు చేయాలనుకునే వారు ఈ ఆఫర్లతో న్యూ ఇయర్‌కు ముందుగానే డ్రీమ్ కారును సొంతం చేసుకోవచ్చు. భారీ డిస్కౌంట్లతో ఏయే కార్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయో చూద్దాం..
వోక్స్వ్యాగన్ విర్టస్
డిసెంబర్ ఇయర్ ఎండ్ స్టాక్ క్లియరెన్స్‌లో భాగంగా వోక్స్వ్యాగన్ విర్టస్ హైలైన్ వేరియంట్‌ను రూ .12.69 లక్షల స్పెషల్ ప్రైస్‌ను ఆఫర్ చేస్తోంది. దీనికి అదనంగా రూ .20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, నాలుగేండ్ల సర్వీస్ వ్యాల్యూ ప్యాకేజ్‌ను ఆఫర్ చేస్తోంది.

వోక్స్వ్యాగన్ టైగున్
బ్రాండ్ ఇయర్ ఎండ్ స్టాక్ క్లియరెన్స్ కింద విర్టస్ తరహాలోనే టైగన్ టాప్‌లైన్ వేరియంట్ ఎస్‌యూవీని రూ .14.99 లక్షల స్పెషల్ ప్రైస్‌పై ఆఫర్ చేస్తోంది. అదనంగా రూ .20,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్, నాలుగేండ్ల సర్వీస్ వ్యాల్యూ ప్యాక్‌ను అందిస్తోంది.
జీప్ కంపాస్
ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా జీప్ కంపాస్‌పై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కంపాస్ పెట్రోల్ వేరియంట్‌పై రూ.2 లక్షల వరకూ విలువైన ప్రయోజనాలు లభిస్తున్నాయి. డీలర్ల నుంచి కూడా ఈ ఎస్‌యూవీపై అదనపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

టాటా సఫారీ
ఇయర్ ఎండ్ సేల్ ఆఫర్లతో కూడిన ఈ జాబితాలో మూడో ఎస్‌యూవీగా టాటా సఫారీ ఆకర్షణీయ ఆఫర్లతో ముందుకొచ్చింది. ఈ హాట్ ఎస్‌యూవీపై రూ .1.25 లక్షల వరకూ బెనిఫిట్స్ కస్టమర్లను ఊరిస్తున్నాయి. ఎక్స్ఛేంజ్, కార్పొరేట్ బోనస్‌ల బొనాంజా టాటా సఫారీని కస్టమర్లకు హాట్ ఛాయిస్‌లా మార్చింది.
మారుతి సుజుకి ఎస్ ప్రెసో సీఎన్జీ, సెలెరియో సీఎన్జీ
సీఎన్జీ మోడల్స్‌పై ఆసక్తి కలిగినవారు ఎస్ ప్రెసో సీఎన్జీ, సెలెరియో సీఎన్జీలను ఇయర్ ఎండ్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ కార్లపై ఏకంగా రూ .75,000 విలువైన బెనిఫిట్స్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

