బామ్మ బాగోగులు చూడాల్సిన వాడే బరితెగించి..
caregiver in Englands Blackpool, Lancashire, was recently caught on camera raping a 99-year old dementia patient
లండన్ : వయసు తారతమ్యం, వావివరసలను మరిచి కామాంధులు పేట్రేగుతున్నారు. ఇంగ్లండ్‌లోని బ్లాక్పూల్ లాంకాషైర్‌లో బామ్మ బాగోగులు చూసేందుకు పనిలో కుదిరిన కేర్‌గివర్ వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. వృద్ధురాలి రూంలో ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో ఈ దారుణం రికార్డు కావడంతో నిందితుడు ఫిలిప్ క్యారీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
కేర్ హోంలో వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నేరం అంగీకరించడంతో ఫిలిప్‌కు న్యాయస్ధానం యావజ్జీవ ఖైదు విధించింది. ప్రిస్టన్ క్రౌన్ కోర్టులో ఫిలిప్పై నేరారోపణలు నిర్ధారణ అయ్యాయి. కేర్ హోంలో అరాచకాలపై బాధితురాలు కుటుంబ సభ్యులకు వివరించి తనను వదిలివెళ్లవద్దని ఆమె ప్రాధేయపడింది. దీంతో కేర్ హోంలో వారు సీక్రెట్ కెమెరాలను అమర్చినా వారు భయపడినంతా జరిగింది. క్యారీ ఫిలిప్ వృద్ధురాలి గదిలోకి వచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వారిని లైవ్ పీడ్లో కనిపించింది.
ప్రాసిక్యూటర్లు ఫోరెన్సిక్ ఆధారాలు, కెమెరా ఫుటేజ్ ముందుంచడంతో కోర్టు ఎదుట ఫిలిప్ తన నేరాన్ని అంగీకరించాడు. ఫిలిప్ పట్ల వృద్ధురాలు, ఆమె కుటుంబం పెంచుకున్న నమ్మకాన్ని భగ్నం చేశాడని, ఆమెను కంటికి రెప్పలా కాపాడాల్సిన నిందితుడు ఇంతటి దారుణానికి తెగబడ్డాడని న్యాయస్ధానం పేర్కొంది. కోర్టు వ్యవహారాలకు సహకరించిన బాధితురాలి కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపింది. నిందితుడిని కఠినంగా శిక్షించడం వారికి కొంత ఊరట ఇచ్చి ఉంటుందని న్యాయమూర్తి పేర్కన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

