Private Jet | టెక్సాస్‌లో హైవేపై కూలిన ప్రైవేట్ జెట్.. స్టార్టప్ సీఈవో దుర్మరణం
Private Jet | అమెరికా (USA) లోని టెక్సాస్ (Texas) రాష్ట్రం లారెడో (Laredo) నగర జాతీయ రహదారిపై ఒక ప్రైవేట్ విమానం (Private Jet) కుప్పకూలింది. ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న విమానం లూప్ 20 రహదారిపై పడిపోగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానం మంటల్లో చిక్కుకున్న సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు స్పందించి, ప్రాణాలకు తెగించి రక్షణ చర్యలు చేపట్టారు.
Private Jet : అమెరికా (USA) లోని టెక్సాస్ (Texas) రాష్ట్రం లారెడో (Laredo) నగర జాతీయ రహదారిపై ఒక ప్రైవేట్ విమానం (Private Jet) కుప్పకూలింది. ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న విమానం లూప్ 20 రహదారిపై పడిపోగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానం మంటల్లో చిక్కుకున్న సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు స్పందించి, ప్రాణాలకు తెగించి రక్షణ చర్యలు చేపట్టారు. విమానం పేలిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ వెనకడుగు వేయకుండా, లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు వారు చేసిన సాహసోపేత ప్రయత్నాలు ఇప్పుడు అందరినీ కదిలిస్తున్నాయి.
మెక్సికో నుంచి టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరానికి వెళ్తుండగా సాంకేతిక లోపాలు తలెత్తడం, ఇంధనం అయిపోవడంతో విమాన సిబ్బంది జెట్‌ను లారెడో అంతర్జాతీయ విమానాశ్రయం వైపు మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే రన్‌వేకు కొద్ది దూరంలోనే విమానం నియంత్రణ కోల్పోయి రహదారిపై ఉన్న విద్యుత్ స్తంభాలను, ఒక వాహనాన్ని ఢీకొట్టి రెండు ముక్కలైంది. ఈ ఘోర ప్రమాదంలో ఆస్టిన్‌కు చెందిన ‘క్యాపిటల్ ఫ్యాక్టరీ’ స్టార్టప్ అధినేత జోషువా బేర్ అక్కడికక్కడే మరణించారు. విమానంలో ఉన్న మిగిలిన ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక బ్యుటీషియన్ జైరా గార్జా, ఆమె భర్తతోపాటు మరికొందరు వాహనదారులు తమ కార్లను నిలిపివేసి విమానం వద్దకు పరుగులు తీశారు. లోపలి నుంచి అద్దాలు పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్న వారిని గమనించి, గొడ్డళ్లు, పారలు, సుత్తులతో విమానం ముఖభాగపు అద్దాలను పగలగొట్టి ఐదుగురిని సురక్షితంగా బయటకు తీశారు. అత్యవసర రక్షణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడానికి ముందే సామాన్య ప్రజలే రక్షకులుగా మారి వారి ప్రాణాలను కాపాడారు. దట్టమైన పొగ కారణంగా ఐదుగురు పోలీసు అధికారులు కూడా అస్వస్థతకు గురవగా వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

