రక్త పరీక్షతో క్యాన్సర్ నిర్ధారణ.. భారతీయ కంపెనీ ఘనవిజయం

న్యూఢిల్లీ: కేవలం రక్త పరీక్షతో క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించే ప్రక్రియను భారతీయ బయోటెక్నాలజీ కంపెనీ ఎపిజనరిస్ రూపొందించింది. ముంబాయికి చెందిన ఈ కంపెనీ సింగపూర్ లోని జార్ ల్యాబ్స్ తో కలిసి సంయుక్తంగా ఈ ప్రక్రియను అభివృద్ధి చేసింది. రెండు కంపెనీలు నానోటెక్ సైంటిస్టు వినయ్ కుమార్ త్రిపాఠి, ఆయన కుటుంబ సభ్యుల యాజమాన్యంలోనివే కావడం విశేషం. ఈ ప్రక్రియపై బెర్లిన్ నుంచి వెలువడే మెడికల్ జర్నల్ సానుకూల సమీక్ష ప్రచురించింది. ప్రక్రియ వందశాతం రుజువైందని పేర్కొన్నది. రెండు కంపెనీల నిర్వహణలో పాలుపంచుకుంటున్న త్రిపాఠీ ఇద్దరు కుమారులు ఆశిశ్, అనిశ్ మీడియాకు ఈ ప్రక్రియ గురించి వివరించారు. ఈ ప్రక్రియకు హెచ్చార్సీ అని పేరు పెట్టారు. వెయ్యిమందిపై జరిపిన పరీక్షల్లో 25 రకాల క్యాన్సర్లు గుర్తించడం జరిగిందని వారు వివరించారు. ముందుగా భారత్‌లో ఈ ప్రక్రియను ప్రారంభించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. సంవత్సరాంతంలో ఈ తరహా క్యాన్సర్ పరీక్షలను ప్రవేశపెడతామని వివరించారు. రక్తాన్ని సేకరించి మాలిక్యులర్ పరీక్షలు నిర్వహించడం ద్వారా క్యాన్సర్ ను పసిగట్టడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. లక్షణాలు బయటపడేందుకు చాలా ముందరే క్యాన్సర్ ఉనికి తెలుస్తుంది. ప్రస్తుతం ఫలితాలు రావడానికి 3-4 రోజులు పడుతున్నది. ఆటోమేషన్ తో ఈ సమయాన్ని 2 రోజులకు తగ్గించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత క్యాన్సర్ పరీక్షలు చాలా బాధాకరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కొత్త ప్రక్రియలో కేవలం 5 మిల్లీలీటర్ల రక్తం తీసుకుంటే చాలు. పరీక్ష అయిపోయినట్టేనని అనిశ్ త్రిపాఠీ అన్నారు. ఈ పరీక్షకు ధర ఎంత ఉండవచ్చని అడిగితే కనీస స్థాయిలోనే ధర నిర్ణయిస్తామని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

