‘బూర్గంపహాడ్- ఇరవెండి రహదారి నిర్మాణం చేపట్టాలి’
బూర్గంపహాడ్-సారపాక, సారపాక-ఇరవెండి ప్రధాన రహదారుల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు మువ్వా వెంకటేశ్వర్లు(లడ్డా) మాట్లాడుతూ...
– సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో
బూర్గంపహాడ్, నవంబర్ 25 : బూర్గంపహాడ్-సారపాక, సారపాక-ఇరవెండి ప్రధాన రహదారుల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు మువ్వా వెంకటేశ్వర్లు(లడ్డా) మాట్లాడుతూ బూర్గంపహాడ్ నుండి ఇరవెండి గ్రామాల మధ్య రహదారి భారీ గుంతలతో అధ్వాన్నంగా తయారైందని, వాహనదారులు ఈ రహదారుల్లో ప్రయాణించాలంటే నానా అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల ఓ గర్భిణీ మెరుగైన వైద్యం కోసం బూర్గంపహాడ్ నుండి భద్రాచలం ఆటోలో వెళ్లాల్సి ఉండగా గుంతల రోడ్డులో కాకుండా మోరంపల్లిబంజర్ మీదుగా క్రాస్ రోడ్ నుంచి భద్రాచలం తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారుల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు.
తక్షణమే అధికారులు స్పందించి రహదారుల మరమ్మతులు చేపట్టాలని లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తొలుత బూర్గంపహాడ్ వీవీబీ చారి అధ్యక్షతన జరిగిన మండల కార్యవర్గ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మువ్వా వెంకటేశ్వర్లు (లడ్డా) మాట్లాడుతూ ప్రజా సమస్యల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి ప్రజాపోరాటాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సబ్కా నాగేశ్వరరావు, నాయకులు బర్ల వెంకటేశ్వర్లు, సిద్ధారపు సుబ్బారెడ్డి, పాండవుల భిక్షం, వీవీబీచారి, సొల్లు పుల్లయ్య, మల్సూర్, ప్రజానాట్య మండలి కళాకారుడు కాటూరి రాము పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బూర్గంపహాడ్- ఇరవెండి రహదారి నిర్మాణం చేపట్టాలి’
Nagurla Venkateshwarlu | దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలి : నాగుర్ల వెంకటేశ్వర్లు
Panchayat Elections | ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి : ఆర్.జె.సి.కృష్ణ
Vitamin B1 | దేశంలో గర్భిణుల్లో పెరుగుతున్న విటమిన్ బి1 లోపం.. దీంతో ఏమవుతుంది.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

