BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
BRS Protest | రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
BRS Protest | రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామంలో జాతీయ రహదారిపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రైతులకు నిరంతర విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.
ధర్నాలో గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ప్రస్తుతం కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపించారు. విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సరైన సమయంలో విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయని, పొలాల్లో భూమి బీటలు వారుతోందని పేర్కొన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర పార్టీ శ్రేణులు పాల్గొని రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

