Blood Test | 12 రకాల క్యాన్సర్లను గుర్తించే రక్త పరీక్ష..
ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని గుర్తించటంలో ‘రక్త పరీక్ష’ చాలా కీలకం. 12 రకాల సాధారణ క్యాన్సర్లను కూడా ముందుగా పసిగట్టే ‘గేమ్ ఛేంజింగ్' అనదగ్గ రక్త పరీక్ష బ్రిటన్లో అందుబాటులోకి రాబోతున్నది.
- బ్రిటన్లో అందుబాటులోకి
Blood Test | లండన్, అక్టోబర్ 6: ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని గుర్తించటంలో ‘రక్త పరీక్ష’ చాలా కీలకం. 12 రకాల సాధారణ క్యాన్సర్లను కూడా ముందుగా పసిగట్టే ‘గేమ్ ఛేంజింగ్’ అనదగ్గ రక్త పరీక్ష బ్రిటన్లో అందుబాటులోకి రాబోతున్నది. క్యాన్సర్ లక్షణాలు రోగిలో బయటపడక ముందే ఈ రక్త పరీక్ష వ్యాధిని బయటపెడుతుందని తెలిసింది. తద్వారా కొన్ని లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు ప్రాణాపాయం తప్పుతుందని, స్కానింగ్లు, టెస్టుల కోసం కొన్ని నెలలపాటు రోగుల సమయం వృథా కాకుండా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
బ్రిటన్ ఆరోగ్య మంత్రి వెస్ స్టీరింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిధులతో దేశవ్యాప్తంగా ‘సార్వత్రిక’ రక్త పరీక్షలను ఈ ఐదేండ్లపాటు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ పథకం కోసం 2.5 మిలియన్ పౌండ్ల (సుమారుగా రూ.27.56 కోట్లు) నిధులను బ్రిటన్ ప్రభుత్వం కేటాయించింది. సార్వత్రిక రక్త పరీక్ష పథకం అమలులో స్టార్టప్ కంపెనీ ‘ఎక్స్జెనెరా’ ప్రభుత్వానికి సాయం చేయనున్నది. ఊపిరితిత్తులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్.. ఇలా 12 రకాల సాధారణ క్యాన్సర్లను గుర్తించే రక్త పరీక్షకు సంబంధించి ఒక రోగికి 120 పౌండ్లు (రూ.13 వేలు) ఖర్చు అవుతుందట.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

