BJP First List | 195 మందితో బీజేపీ లోక్‌సభ అభ్యర్ధుల తొలి జాబితా
BJP First List : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితాను శనివారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు
BJP First List : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీ నగర్ నుంచి బరిలో నిలవనున్నారు. యూపీలోని లక్నో నుంచి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమేథి నుంచి మరోసారి స్మృతి ఇరానీ బరిలో దిగనున్నారు.
గతంలో రాజ్యసభకు ఎన్నికైన ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గుజరాత్‌లోని పోర్ బందర్ నుంచి పోటీ చేయనున్నారు. ఢిల్లీ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, మనోజ్ తివారీ, సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ బరిలో నిలవనున్నారు. జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌లోని గుణ స్ధానం నుంచి, రాజ్యసభ ఎంపీ భూపీందర్ యాదవ్ అళ్వార్ నుంచి లోక్‌సభ ఎన్నికల పోరులో దిగనున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను విదిశ నుంచి లోక్‌సభ బరిలో నిలిపారు.
ఇక తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులకు అవకాశం లభించగా 28 మంది మహిళలకు చోటు దక్కింది. ఇద్దరు మాజీ సీఎంలకు అవకాశం కల్పించారు. 57 మంది ఓబీసీలకు తొలి జాబితాలో స్ధానం కల్పించారు. తొలి జాబితాలో యువతకు 47 స్ధానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్ధానాలను కేటాయించామని పార్టీ నేత వినోద్ తావ్డే తెలిపారు. కీలక యూపీ నుంచి 51 మంది అభ్యర్ధులను తొలి జాబితాలో ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ నుంచి 20 మంది, ఢిల్లీ నుంచి బరిలో నిలిచే 5గురి పేర్లను తొలి జాబితాలో వెల్లడించారు. ఇక తెలంగాణ నుంచి 9 మంది ఎంపీ అభ్యర్ధులకు తొలి జాబితాలో చోటు దక్కింది.
Read More :
Gautam Gambhir | నడ్డా జీ.. నన్ను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించండి: గౌతమ్ గంభీర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Railways | దీపావళి వేళ దక్షిణ మధ్య రైల్వే అలర్ట్.. వీటిని రైళ్లలో అస్సలు తీసుకురావద్దంటూ రిక్వెస్ట్!
IPE Director | ఐపీఈ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ లింబాద్రి బాధ్యతల స్వీకరణ
Metro RTC Pass | రూ.8,500 పాస్ రూ.4 వేలకే.. మెట్రో-ఆర్టీసీ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్
Sreemukhi | మత్తెక్కించే చూపులతో శ్రీముఖి..
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

