ChatGPT | ఏఐ చాట్‌బాట్స్‌పై బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు
ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT)పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతుండగా ఏఐ టూల్స్‌పై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకులు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూయార్క్ : ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT)పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతుండగా ఏఐ టూల్స్‌పై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకులు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో ఏఐ టూల్స్ మనుషుల తరహాలో బోధనా సామర్ధ్యాలను కలిగిఉంటాయని, రాబోయే రోజుల్లో ఇవి ట్యూటర్లుగా మారతాయని అంచనా వేశారు.
బింగ్, బార్డ్, చాట్‌జీపీటీ వంటి ఏఐ చాట్‌బాట్స్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న క్రమంలో ఏఐ టూల్స్ ఎదుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గేట్స్ పేర్కొన్నారు. ఏఎస్యూ+జీఎస్వి సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో విద్యార్ధులకు బోధనలో ఏఐ చాట్‌బాట్స్ సహకరిస్తాయని అన్నారు.
ఇవి రాబోయే రోజుల్లో మానవ టీచర్ల తరహాలోనే మెరుగైన బోధన అందిస్తాయని కూడా బిలియనీర్ చెప్పారు. ఇక మార్చిలో ఓ బ్లాగ్ పోస్ట్‌లోనూ ఏఐ టూల్స్ ప్రయోజనాలపై సవివరంగా రాసుకొచ్చారు. ఏఐ టూల్స్ కొన్ని రిస్క్‌లను మానవాళి ముందుంచినా అవి మనకు మేలు చేస్తాయని, మన అంచనాలకు మించి వాటి పరిమితులు విస్తృతమవుతాయని పేర్కొన్నారు.
Read More
Anand Mahindra | కృత్రిమ మేధతో ముప్పు..? ఆనంద్ మహీంద్రా స్పందన ఏంటంటే..
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- AI chatbots
- Bill Gates
- ChatGPT
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

