Big boss Keerthi Engagement | కార్తీక దీపం నటి, బిగ్ బాస్ ఫేం కీర్తి భట్ ఎంగేజ్మెంట్ ఆదివారం జరిగింది. ప్రియుడు విజయ్ కార్తిక్‌తో కలిసి హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరుపుకుంది. ఈ వేడుకకు బిగ్‌బాస్ సెలబ్రెటీలతో పాటు సీరియల్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం వీళ్ల ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మనసిచ్చి చూడు సీరియల్‌తో తెలుగు సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన కీర్తి.. కార్తిక దీపం సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో అడుపెట్టిన తర్వాత ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
కీర్తి భర్త విజయ్ కార్తిక్ కూడా నటుడే. ఆ మధ్య మాటీవీలో మా బోనాల జాతర ప్రోగ్రాంలో విజయ్‌తో ఎంగేజ్మెంట్ జరుపుకుని కీర్తి అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే వేదికపై అత్తమామలను కూడా పరిచయం చేసింది. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన విజయ్ ‘మెలోడీ’ అనే సినిమాతో నటుడిగా అవతారం ఎత్తాడు. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్‌గా నటించాడు. ఈ రోల్ విజయ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ‘సేడు’ అనే సినిమాతో హీరోగా మారాడు. కన్నడలో కేజీఎఫ్ సినిమాతో పాటు అదే రోజు ‘సేడు’ సినిమా రిలీజ్ అయ్యి హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత కాలాధిపతి, రామబంట వంటి పలు కన్నడ సినిమాల్లో నటించాడు. కేవలం నటుడిగానే కాకుండా విజయ్ ఏబి పాజిటీవ్ అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. తెలుగులో చెడ్డీ గ్యాంగ్‌తో పాటు పలు వెబ్ సిరీస్‌లో చేశాడు.
ఇక కీర్తి భట్ కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. చిన్నతనం నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండటంతో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. డ్యాన్స్ కూడా నేర్చుకుంది. ఉన్నత విద్యాభ్యాసం పూర్తి కాగానే కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కన్నడలో 2017లో ‘ఐస్ మహల్’ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అక్కడే వరుసపెట్టి మూడు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించింది. తెలుగులో మనసిచ్చి చూడు సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సీరియల్లో భాను అనే పాత్రలో అద్భుతంగా నటించి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆరేండ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది కీర్తి భట్. ఆ తర్వాత తనూ భట్ అనే ఓ చిన్నారిని దత్తత తీసుకుంది.