Bigg boss 6 telugu Twist | ఇంటిసభ్యులతో సరదా ఆటలు..కానీ ఎలిమినేషన్లో ఊహించని ట్విస్టు..!
నాగార్జున (Akkineni nagarjuna) స్టైలిష్‌గా ఎంట్రీతో ఆదివారం ఎపిసోడ్ మొదలైన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ షో సీజన్ -6 (Bigg Boss 6 Telugu) సన్ డే ఎపిసోడ్లో ఫన్నీ ఆటలు ఆడించాడు నాగార్జున.
టుడే అంటే సన్ డే..సన్ డే అంటే ఫన్ డే..ఆటలు పాటలు మధ్యలో ఎలిమినేషన్స్ ..అంటూ నాగార్జున (Akkineni nagarjuna) స్టైలిష్‌గా ఎంట్రీతో ఆదివారం ఎపిసోడ్ మొదలైన విషయం తెలిసిందే.
బిగ్‌బాస్ షో సీజన్ -6 (Bigg Boss 6 Telugu) సన్ డే ఎపిసోడ్లో ఫన్నీ ఆటలు ఆడించాడు నాగార్జున. అయితే ఎలిమినేషన్ విషయంలో మాత్రం చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ అందరికీ షాకిచ్చాడు.
మొదట ‘ ఎవరికి ఎంత తెలుసు’అనే ఆట ఆడించాడు నాగ్. బిగ్ బాస్ హౌస్‌లో శ్రీహాన్ మొదట ఎక్స్పోజ్ చేసిన ప్లేస్ ఏది..? రెండోది ‘ఆర్జే సూర్య ఎంతమందిని మిమిక్రీ చేయగలడు..? మరోవైపు శ్రీసత్య శరీరంపై ఎన్ని టాటూలున్నాయి..? అంటూ నాగ్ కంటెస్టెంట్స్ ను ఫన్నీ ప్రశ్నలు అడుగగా ..వాటికి హౌస్ మేట్స్ ఫన్నీ సమాధానాలు చెప్పారు..అలా ఫన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆటతో గేమ్ షో ముగిసింది. ఈ గేమ్ షోలో బాలాదిత్య ఎక్కువ ప్రశ్నలకు జవాబు చెప్పి స్టార్ ఆఫ్ ది వీక్‌గా నిలిచాడు. బిగ్ బాస్ నుంచి స్పెషల్ కానుకను కూడా అందుకున్నాడు బాలాదిత్య.

రేవంత్ సేవ్ ..
నామినేషన్స్ లో ఉన్న అభినయశ్రీ, రేవంత్, ఫైమా, ఆరోహి, ఇనయాలకు ఓ బ్యాటన్ ఇచ్చి ఓపెన్ చేయమన్నాడు. బ్లూ కలర్ వస్తే వారు సేఫ్ అని చెప్పగా..వీరిలో ఫైమా సేవ్ అయింది.
ఆ తర్వాత ఐటమ్ నంబర్ గేమ్ ఆడించాడు..ఏ, బీ టీమ్స్‌గా విభజించగా..ఏ టీంలో అభినయశ్రీ, రేవంత్, నేహా, అర్జున్, మెరీనా, రోహిత్, షానీ, ఇనయ, చంటి, శ్రీసత్య ఉండగా..మిగిలిన వాళ్లు బీ టీంలో ఉన్నారు. ఈ గేమ్‌లో ఏ టీం సభ్యులు గెలిచారు. అయితే ఆట మధ్యలో రేవంత్ సేవ్ అయినట్టు నాగ్ వెల్లడించాడు. చివరగా నామినేషన్స్ లో ఉన్న ఆరోహి, ఇనయ, అభినయ శ్రీల్లో ఆరోహి సేవ్ అయినట్టు ప్రకటించాడు నాగ్.

ఇనయ, అభినయ శ్రీ ఇద్దరూ సేఫ్..కానీ
చివరగా గార్డెన్ ఏరియాలో ఉన్న సుత్తిని ఇనయ, అభినయ శ్రీల్లో ఎవరు ఎత్తితే వారు సేఫ్ అవుతారన్నాడు నాగార్జున. ఇద్దరూ సుత్తిని ఎత్తడంతో ఇద్దరూ సేవ్ అయ్యారని ప్రకటించాడు. కంటెస్టెంట్స్ ఇప్పుడిపుడే హౌస్‌లో సెటిల్ అవుతున్నారు. ఈ సారి ఎలిమినేషన్ లేదని ప్రకటించడంతో సంతోషంలో మునిగిపోయారు హౌస్మేట్స్. మొత్తానికి ఎవరు ఎలిమినేట్ అవుతారోనని టెన్షన్లో ఉన్న ఇంటి సభ్యులతో చివరి దాకా ఏదో ఒక ఆట ఆడించి..ఊహించని ట్విస్ట్ ఇస్తూ అందరూ సేఫ్ అని ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు హౌస్ మేట్స్.
Sunday fun tho paatu koncham heat! 🤯
Modhati vaaram Bigg Boss house nundi eliminate ayyedi evaru?Don't miss tonight's Bigg Boss episode at 9 PM on @StarMaa & @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/lttZ6zsAOf
— Starmaa (@StarMaa) September 11, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

