LPG gas cylinder Hike | వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధర..
LPG gas cylinder Hike | దేశీయ చమురు కంపెనీలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. వాణిజ్య సిలిండర్ ధరను రూ.265కు పెంచగా.. ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో

న్యూఢిల్లీ : దేశీయ చమురు కంపెనీలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. వాణిజ్య సిలిండర్ ధరను రూ.266కు పెంచగా.. గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. తాజాగా పెంచిన ధరలతో కమర్షియల్ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.2000 మార్క్‌ను దాటింది. ఇంతకు ముందు ధర రూ.1735గా ఉండేది. ప్రస్తుతం రూ.2,175కు పెరిగింది. ముంబైల్లో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1950, కోల్‌కతాలో రూ.2073.50, చెన్నైలో ధర రూ.2133కు చేరింది. ఇప్పటికే ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు చేరగా.. గ్యాస్ ధరలు సైతం చుక్కలనంటుతుండడంతో దుకాణదారులు బెంబేలెత్తుతున్నారు.
వాణిజ్య సిలిండర్లను ఎక్కువగా హోటల్స్, రెస్టారెంట్లు వినియోగిస్తుంటాయి. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో 14.2 కేజీల నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.899.50 పలుకుతోంది. ఇంతకు ముందు అక్టోబర్ 1న 19 కిలోల కమర్షియల్, 6న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ప్రస్తుతం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.926, చెన్నైలో రూ.915.50 ధర పలుకుతున్నది. ఇటీవల పెరుగుతూ వస్తున్న ముడిచమురు ధరల దృష్ట్యా ఈ సారి ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1000 దాటుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే రూ.100 వరకు పెంచే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

