హైదరాబాద్, జనవరి 13: ప్రము ఖ మొబైల్ విక్రయ సంస్థ బిగ్’సి’ సం క్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నట్టు కంపెనీ సీఎండీ బాలు చౌదరి తెలిపారు. మొబైల్ కొనుగోలుపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌తోపాటు వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ఆన్లైన్ కన్నా తక్కువ ధరకే మొబైల్స్‌ను కొనుగోలుదారులకు అందిస్తున్నట్టు, దీంతోపాటు ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతిని ఇవ్వనున్నట్టు బాలు చెప్పారు. ఈ ప్రత్యేక ఆఫర్లు ఈ నెల 26 వరకు అమలులో ఉండనున్నాయి.