శివ కందుకూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. రాశి సింగ్ నాయిక. పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబైలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌గ్లింప్స్‌ను మంగళవారం విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘మైథాలజీ నేపథ్యంలో జరిగే ఆసక్తికరమైన కథ ఇది. గ్రామీణ వాతావరణంలో జరిగే ఈ కథలో శివ కందుకూరి డిటెక్టివ్‌గా కనిపిస్తాడు. టైటిల్ పాత్రలో ఆయన క్యారెక్టర్ పూర్తి వినోదాత్మకంగా ఉంటూనే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం అందరికి థ్రిల్‌ను కలిగిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. అరుణ్, దేవిప్రసాద్, వర్షిణి, శివకుమార్, కల్పలత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజయ బుల్గానిన్.