శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంతులూరి దర్శకుడు. వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. కేథరిన్ కథానాయిక. బుధవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. రెండు చేతుల్లో రెండు తుపాకులు పట్టుకొని రౌద్రంగా శ్రీవిష్ణు కనిపిస్తున్నారు. రౌడీ గ్యాంగ్ అతడిని చుట్టుముట్టి ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తున్నది. నిర్మాత మాట్లాడుతూ ‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. శ్రీవిష్ణు పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. మునుపెన్నడూ చూడనటువంటి కొత్త పాత్రలో ఆయన కనిపిస్తారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.