రూ.10 లక్షల లోపు బెస్ట్ డీజిల్ కార్లు ..

హైదరాబాద్,జూలై :కారు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. అయితే బడ్జెట్ ప్రైజ్ లో సూపర్ ఫీచర్లు కలిగినవైతే మరీ బెటర్ కదా..! కొన్ని కార్ల కంపెనీలు తమ డీజిల్ మోడళ్లను బడ్జెట్ ప్రైజ్ కే విక్రయిస్తున్నాయి. ఇవన్నీ బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు లోబడి ఉంటాయి. ప్రస్తుతం ఇండియా మార్కెట్లో రూ.10 లక్షల ధర లోపు లభిస్తున్న బెస్ట్ డీజిల్ కార్లు ఇవిగో..
టాటా ఆల్ట్రోజ్ …

టాటా ఆల్ట్రోజ్ ఇండియా ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ నుంచి లభిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. డీజిల్ వెర్షన్ టాటా ఆల్ట్రోజ్ కారులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 90 బిహెచ్పి పవర్‌ను,200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో డీజిల్ వెర్షన్ టాటా ఆల్ట్రోజ్ ధరలు రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.55 లక్షల మధ్యలో ఉన్నాయి.
ఫోర్డ్ ఫిగో…

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఫిగో కూడా పెట్రోల్,డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. డీజిల్ వెర్షన్ ఫోర్డ్ ఫిగో కారులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 100 బిహెచ్పి పవర్‌ను ,215 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో ఫోర్డ్ ఫిగో డీజిల్ కార్ల ధరలు రూ.6.86 లక్షల నుంచి రూ.8.37 లక్షల మధ్యలో ఉన్నాయి.
ఫోర్డ్ ఫ్రీస్టైల్…

ఫోర్డ్ ఇండియా నుంచి లభిస్తున్న డీజిల్ కారు ఫ్రీస్టైల్. క్రాసోవర్ మాదిరిగా ఉండే ఫోర్డ్ ఫ్రీ స్టైల్ కూడా ఫిగో లాగ ఒకేరకమైన డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఫోర్డ్ ఫ్రీస్టైల్ డీజిల్ కారులో 1.5 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 100 బిహెచ్పి పవర్‌ను ,215 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో ఫోర్డ్ ఫ్రీస్టైల్ డీజిల్ కార్ల ధరలు రూ.7.34 లక్షల నుంచి రూ.9.02 లక్షల మధ్యలో ఉన్నాయి.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న హ్యాచ్‌బ్యాక్ కారు గ్రాండ్ ఐ10 నియోస్. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ కారులోని 1.2 లీటర్ డీజిల్ ఇంజన్ 75 బిహెచ్పి పవర్‌ను,190 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో డీజిల్ వెర్షన్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధరలు రూ.7.30 లక్షల నుంచి రూ.8.45 లక్షల మధ్యలో ఉన్నాయి.
కియా సోనెట్…

కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో అత్యంత పాపులర్ అయిన కొరియన్ బ్రాండ్ కార్ కియా సోనెట్, ఈ విభాగంలో రెండు రకాల డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. కియా సోనెట్ రెండు డీజిల్ ఇంజన్లు కూడా 1.5 లీటర్ యూనిట్ రూపంలో ఉంటాయి. కాకపోతే వీటిని రెండు పవర్ ట్యూన్లలో విక్రయిస్తున్నారు. ఇందులో మొదటి ఇంజన్ 100 బిహెచ్పి పవర్ /240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండోది115 బిహెచ్పి పవర్/250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో కియా సోనెట్ డీజిల్ ధరలు రూ.8.35 లక్షల నుంచి రూ.13.35 లక్షల మధ్యలో ఉన్నాయి.
హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ మోటార్ ఇండియా నుండి లభిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 కూడా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. ఈ కారులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 100 బిహెచ్పి పవర్‌ను,240 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో ఈ కారు ధరలు రూ.8.21 లక్షల నుంచి రూ.10.76 లక్షల మధ్యలో ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- auto news
- automobile
- budget
- Cars
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

